ఇండస్ట్రిలో లెక్కలు మారిపోతున్నాయి . కోట్లకు కోట్లు భారీ బడ్జెట్ పెట్టి తెరకెక్కిస్తున్న సినిమాలు మొత్తం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవుతున్నాయి . సింపుల్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు హిట్ అవుతున్నాయి. తాజాగా సంక్రాంతి కానుకగా వచ్చిన బడా సినిమా ‘గేమ్ చేంజర్” ఎలా నెగిటివ్ టాక్ సంపాదించుకుందో అందరికి తెలిసిందే . ఆ తర్వాత వచ్చిన “డాకు మహారాజ్” సినిమా ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసేసింది. ఆ తర్వాత వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది . వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ అదిరిపోయే రేంజ్ లో కలెక్ట్ చేసింది.దానికి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా అంటేనే ఆ మూవీ పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటారు జనాలు . అది ఎఫ్ 2, ఎఫ్ 3.. లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ అవుతుంది అంటే సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది అర్థం చేసుకోవచ్చు . కాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకోవడమే కాకుండా .. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా దాదాపు 29 కోట్లు షేర్ రాబట్టింది అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
కాగా సంక్రాంతికి వచ్చిన మూవీస్ లో లిమిటెడ్ స్క్రీన్స్ లో బ్రూటల్ ర్యాంప్ ని చూపించింది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా అనే చెప్పాలి. మిగతా సినిమాకి టికెట్ రేట్లు స్క్రీన్స్ ఎక్కువగా ఇచ్చారు . అయితే సంక్రాంతికి వస్తున్నాం విషయంలో మాత్రం అలా జరగలేదు. కానీ వెంకీ మామ తన సత్తా చూపించాడు . మొదటి రోజే ఏకంగా 29 కోట్లు కలెక్ట్ చేసి ఆయన కెరియర్ లో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ హిట్టుగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను నిలుపుకున్నాడు. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే సుమారుగా 43 కోట్లు జరిగినట్లు తెలుస్తుంది . ఆంధ్ర , నైజాంలో కలిపి మొత్తంగా 33 కోట్లు ఇతర రాష్ట్రాలలో ఓవర్సీస్ లో కలిపి 10 కోట్ల రూపాయలుగా నమోదయింది . మొత్తానికి 43 కోట్ల రూపాయలతో బిజినెస్ ను సంక్రాంతికి వస్తున్నాం దక్కించుకోగలిగింది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో వరుసగా సంక్రాంతి హాలిడేస్ ఉండడంతో ఈ సినిమా ఇంకా కలెక్షన్స్ పరంగా దున్నేస్తుంది అంటున్నారు సినీ ప్రముఖులు . చూద్దాం మరి రెండవ రోజు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో..?
కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ డే కలెక్షన్స్..మొత్తం ఎన్ని కోట్లు అంటే..?
