అక్కినేని ఫ్యామిలీలో ఇటీవల నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఈ కుటుంబాల సభ్యులు హాజరై వారిద్దరిని ఆశీర్వదించారు. నాగచైతన్యకు అంతకుముందే ఒకప్పటి స్టార్ హీరోయిన్ సమంతతో పెళ్లి జరిగి విడాకులు కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో అక్కినేని హీరో అఖిల్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇప్పటికీ అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ జైనార్ రవ్జ్‌దేతో జరిగింది.ఇప్పుడు వీరిద్దరి వివాహానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. మార్చి 20న అఖిల్ మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. అయితే వీరి వివాహాన్ని కూడా నాగార్జున నాగచైతన్య వివాహం జరిగిన ప్లేస్ లోనే చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. నాగచైతన్య – శోభిత వివాహ వేదిక అయిన అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహం జరిపేందుకు అక్కినేని కుటుంబ సభ్యులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
అన్నపూర్ణ స్టూడియోతో అక్కినేని ఫ్యామిలీకి ఎంతో అనుబంధం ఉంది.. ఎమోషనల్ బాండింగ్ ఉంది. తాజాగా అన్నపూర్ణ స్టూడియో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగర్జున ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే అఖిల్ వివాహం కూడా తమకు ఎంతో అనుబంధం ఉన్న అన్నపూర్ణ స్టూడియోలో జరపాలని నాగార్జునతో పాటు అటు జైనాబ్ కుటుంబ సభ్యులు కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అఖిల్ పెళ్లికి కూడా చైతు సెంటిమెంటే ఫాలో అవుతోన్న నాగార్జున..!
