Moviesమెగాస్టార్ .. మెగా స్ట్రాంగ్ లైన‌ప్‌.. నెక్ట్స్ ఈ 4 గురు...

మెగాస్టార్ .. మెగా స్ట్రాంగ్ లైన‌ప్‌.. నెక్ట్స్ ఈ 4 గురు ద‌ర్శ‌కుల‌తోనే సినిమాలు…!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వ‌చ్చే సమ్మర్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాను క‌ళ్యాణ్‌రామ్‌తో బింబిసార సినిమా తెర‌కెక్కించిన యువ దర్శకుడు మ‌ల్లిడి వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా సోషియో ఫాంట‌సీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి త‌ర్వాత చిరు న‌టిస్తోన్న ఈ సోషియో ఫాంట‌సీ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి.Anil Ravipudi Makes a Hilarious Comeback on Nov 30 | Anil Ravipudi Makes a  Hilarious Comeback on Nov 30విశ్వంభ‌ర త‌ర్వాత చిరంజీవి నానితో ద‌స‌రా సినిమా తెర‌కెక్కించిన శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల సినిమా కూడా త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఈ సినిమా పూర్తయిన వెంట‌నే తాజాగా సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాతో త‌న ఖాతాలో వ‌రుస‌గా ఎనిమిదో హిట్ వేసుకున్న‌ అనిల్ రావిపూడి తో కూడా చిరు ఓ సినిమా చేయనున్నారు.Director Bobby: డైరెక్టర్ బాబీ నెక్స్ట్ చేయబోయేది ఆ మెగా హీరోతోనా..?  ఫ్యాన్స్‌కు పండగే - Telugu News | Is director Bobby going to make a movie  with mega hero Sai Dharam Tej next? | TV9 Telugu

ఈ మూడు సినిమాల త‌ర్వాత చిరు మ‌రోసారి త‌న వాల్తేరు వీర‌య్య డైరెక్ట‌ర్ బాబీతో కూడా చిరంజీవి సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా వ‌చ్చిన డాకు మహారాజ్ సినిమాలో బాలయ్యను సరికొత్తగా ప్రజెంట్ చేశాడు బాబీ. ఈ సినిమా లో బాల‌య్య‌ను చాలా స్టైలీష్ గా చూపించి హిట్ కొట్టాడు. దీంతో ఇప్పుడు మ‌రోసారి చిరు.. బాబితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు టాక్ ? ఏదేమైనా చిరు నెక్ట్స్ లైన‌ప్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంద‌నే చెప్పాలి.

Latest news