నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా .. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా అఖండ 2 – తాండవం. బాలయ్య – బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చూశాం. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న అఖండ 2 తాండవం షూటింగ్ అలా స్టార్ట్ అయ్యిందో లేదో అంచనాలు ఆకాశంలోకి వెళ్లిపోయాయి. ఇక ఈ సినిమా తాజా షూటింగ్ ప్రపంచంలోనే పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగరాజ్‌లో జరుగుతోన్న మహా కుంభమేళాలో జరుగుతోంది.ఇప్పటి వరకు ఈ సినిమా కాస్టింగ్‌పై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవం రోజున మాత్రం బాలయ్యతో పాటు అఖండలో నటించిన హీరోయిన్ ప్రగ్య జైశ్వాల్ నటిస్తోందన్న ఒక్క మ్యాటర్ మాత్రం బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అలనాటి మేటి నటి.. సీనియర్ హీరోయిన్ శోభన ఓ సన్యాసి పాత్రలో కనిపించబోతున్నారట.
శోభన 18 ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రభాస్ ‘కల్కి’ సినిమాలో ‘మరియమ్’ పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆమె గతంలో బాలయ్యతో కలిసి నారి నారి నడుమ మురారి సినిమాలోనూ నటించారు. మరి గతంలో బాలయ్యకు హిట్ ఇచ్చిన హీరోయిన్ సెంటిమెంట్ ఇప్పుడు మరోసారి అఖండ 2కు ఎంత వరకు కలిసి వస్తుందో ? చూడాలి.
అఖండ 2 లో అలనాటి స్టార్ హీరోయిన్… బాలయ్యకు సెంటిమెంట్ కలిసొస్తుందా..!
