Moviesషాకింగ్‌.. విడాకులు కాన్ఫ‌ర్మ్ చేసిన మ‌రో టాలీవుడ్ హీరోయిన్‌..!

షాకింగ్‌.. విడాకులు కాన్ఫ‌ర్మ్ చేసిన మ‌రో టాలీవుడ్ హీరోయిన్‌..!

ఫిల్మ్ ఇండస్ట్రీలో విడాకులు చాలా కామన్ అయిపోయాయి. ఇష్టం లేకుండా కలిసుంటూ బాధపడే కంటే విడిపోయి ఆనందంగా ఉండడమే మేలన్న ఫార్ములాను సినీ తారలు బాగా ఫాలో అవుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ ఇన్ డైరెక్ట్ గా తన విడాకులు కన్ఫార్మ్ చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు కలర్స్ స్వాతి. టీనేజ్ లోనే ` కలర్స్` అనే టీవీ షో ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న స్వాతి.. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది.Colors Swathi: సిల్వర్‌స్ర్కీన్‌పై రీ ఎంట్రీ ఇవ్వనున్న స్వాతి.. ఆ యంగ్ హీరో  సినిమాతో పాటు.. - Telugu News | Colors Swathi ready to re entry on silver  screen with Month Of Madhu movie | TV9 Teluguఅష్టా చెమ్మా మూవీ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు అమ్మాయి కావడం వల్ల టాప్ హీరోలతో నటించే అవకాశం దక్కకపోయినా.. వచ్చిన అవకాశాలనే సద్వినియోగం చేసుకుంటూ కలర్స్‌ స్వాతి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే కేరళకు చెందిన పైలట్ వికాస్ వాసు అనే వ్యక్తిని 2018లో వివాహం చేసుకుంది. కానీ కొన్నేళ్లకే వీరి మధ్య‌ మనస్పర్ధలు తలెత్తాయి.

చాలాకాలం నుంచి వికాస్‌, స్వాతి విడివిడిగా ఉంటున్నారు. కొన్ని నెలల క్రితం స్వాతి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి త‌మ పెళ్లి ఫోటోలతో పాటు తన భర్తతో దిగిన ఫోటోల‌న్నింటినీ తొలగించింది. ఆ స‌మ‌యంలోనే స్వాతి విడాకుల వార్తలు గుప్పుమ‌న్నాయి. ` మంత్ ఆఫ్ మధు` సినిమా ప్రమోషన్స్ స‌మ‌యంలో మీడియా వారు ఈ విషయంపై ప్రశ్నించగా.. అది నా ప‌ర్స‌న‌ల్, న‌మాధానం చెప్పనంటూ స్వాతి తేల్చి చెప్పింది.Colours Swathi: భర్తకు విడాకులు ఇచ్చిన కలర్స్ స్వాతి.. ఇదిగో సాక్ష్యం.. ?అయితే ఇప్పుడు మరోసారి స్వాతి విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి. ఇందుకు కారణం లేకపోలేదు. గతంలో ఫోటోలు డిలీట్ చేసిన స్వాతి.. ఇప్పుడు సోషల్ మీడియాలో భర్త వికాస్‌ను అన్‌ఫాలో చేసేసింది. దీంతో వికాస్‌, స్వాతి విడాకులను నెటిజ‌న్లు క‌న్ఫార్మ్ చేసేస్తున్నారు. సాధార‌ణంగా సెలబ్రెటీలు విడాకులు తీసుకుంటే.. మొద‌ట సోష‌ల్ మీడియా అకౌంట్స్ నుంచి వెడ్డింగ్ ఫోటోలు తొల‌గించ‌డం, ఒక‌రినొక‌రు అన్‌ఫాలో కావ‌డం చేస్తుంటారు. స్వాతి కూడా అదే రూట్‌లో వెళ్తుంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Latest news