నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ సినిమా ‘డాకు మహారాజ్’ . బాలయ్యకు వరుసగా నాలుగో హిట్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ బాబి ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ అనంతపురంలో జరిగింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ కొల్లి కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా బాలయ్య మరోసారి తన మాస్ నటవిశ్వరూపం చూపించేశాడు.ఈ విజయోత్సవ వేడుకల్లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బాలయ్య నెక్ట్స్ సినిమా అఖండ 2 – తాండవంపై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చేశాడు. మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను అఖండ 2ను ఎలా తెరకెక్కిస్తున్నాడో తనకు తెలుసు అని.. ఈ సినిమా మాస్ జాతరగా ఉండబోతోందని.. ఇంటర్వెల్ టైంకే ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అవుతుందని థమన్ చాలా గట్టిగా చెప్పాడు.
ఇలా ‘ అఖండ 2 ’ సినిమాపై థమన్ చేసిన కామెంట్స్ నందమూరి, బాలయ్య అభిమానులకు మాంచి కిక్ ఇచ్చాయి. బోయపాటి ఈ సినిమా షూటింగ్ స్పీడ్‌గా పూర్తి చేసి వచ్చే దసరాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
అఖండ 2 ఇంత పెద్ద హిట్ కాబోతోందా… ఇంటర్వెల్‌కు పూనకాలు లోడింగ్..!
