Moviesటాలీవుడ్‌లో 25 ఏళ్ల సీన్ రిపీట్.. ' సంక్రాంతికి వ‌స్తున్నాం '...

టాలీవుడ్‌లో 25 ఏళ్ల సీన్ రిపీట్.. ‘ సంక్రాంతికి వ‌స్తున్నాం ‘ హిట్ వెన‌క ఈ సెంటిమెంట్ ఉందా..!

టాలీవుడ్లో సంక్రాంతి పండుగ సీజన్‌లో బాక్సాఫీస్ దగ్గర సినిమాలు పోటీ పడుతుండటం కామన్గా న‌డుస్తూ వ‌స్తోంది. అందులో కొన్ని సినిమాలు హిట్ అవుతుంటే.. మ‌రి కొన్ని సినిమాలు ప్లాప్ అవుతూ ఉంటాయి. గ‌త కొన్నేళ్లుగా సంక్రాంతికి మూడు.. నాలుగు పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ సారి సంక్రాంతికి కూడా మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి.జనవరి 10న రిలీజ్ అయిన రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ – జనవరి 12న నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ – జనవరి 14న విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ రిలీజ్ అయ్యాయి. ఈ మూడు సినిమాల్లో వెంకీ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్‌.. బాల‌య్య సినిమా హిట్‌.. గేమ్ ఛేంజ‌ర్ ప్లాప్‌. ఇదే సీన్ టాలీవుడ్ లో 25 ఏళ్ల క్రితం.. అంటే 2000 సంవత్సరంలోనూ జ‌రిగింది.Vamsodharakudu (2000) — The Movie Database (TMDB)అప్పుడు కూడా ముగ్గురు స్టార్‌ హీరోల సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి ‘అన్నయ్య’ జనవరి 7న – బాలకృష్ణ ‘వంశోద్ధారకుడు’ – వెంకటేష్ ‘కలిసుందాం రా’ జనవరి 14న రిలీజ్ అయ్యాయి. ఈ మూడింటిలోనూ కలిసుందాం రా ఓవరాల్ బ్లాక్‌బస్టర్.. ఇప్పుడు 25 ఏళ్ల త‌ర్వాత కూడాఓ మెగా హీరో, నందమూరి హీరో సినిమాలకు పోటీగా దిగిన వెంకటేష్ త‌న విక్ట‌రీ సాధించి పై చేయి నిలుపుకున్నారు. అలా ఆ సెంటిమెంట్ మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు రిపీట్ అయ్యింది.

Latest news