అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోలు మరికొద్ది గంటలలో ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. భారతదేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు అందరూ పుష్ప 2 సినిమా కోసం.. ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో సినిమాను ప్రమోట్ చేశారు. అల్లు అర్జున్ పుష్ప 2 ప్రమోషన్ కార్యక్రమాలు ఎక్కడ జరిగిన భారీ ఎత్తున అభిమానులు వస్తున్నారు. దీంతో పుష్ప 2 క్రేజ్.. దేశ వ్యాప్తంగా ఎలా ఉందో తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అల్లూ ఫ్యామిలీకి చెందిన కటౌట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఓ సినిమా ధియేటర్ వద్ద ఫ్యాన్స్.. అల్లు కుటుంబం మొత్తాన్ని కటౌట్ తో ఏర్పాటు చేశారు. ఇందులో అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, అల్లు బాబి, అల్లు అర్జున్, అల్లు శిరీష్.. చివరకు అల్లు అయాన్ కూడా ఉండటం విశేషం. థియేటర్ వద్ద ఏర్పాటుచేసిన ఈ కటౌట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే ఈ ప్లెక్సీలో ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీ హీరోల ప్రస్తావన రాలేదు. ఒక్కరంటే ఒక్క మెగా హీరో కూడా లేరు. మెగా, అల్లు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయన్న ప్రచారం గట్టిగా జరుగుతుంది. గత ఎన్నికల సమయంలో జనసేనకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేశారు.మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ కు అండగా నిలిస్తే.. అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన నంద్యాల అభ్యర్థి శిల్ప రవి కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో ఆ తర్వాత కూడా అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్‌ను కలిసి అభినందనలు తెలియజేయకపోవడం.. ఇలాంటి పరిణామాలు అన్ని రెండు కుటుంబాల మధ్య గ్యాప్ మరింతగా పెరగడానికి కారణమైనట్టు కనిపిస్తుంది. ఇప్పటివరకు బన్నీ కటౌట్ లలో మెగా ఫ్యామిలీ ప్రస్తావన ఉండేది. ఇప్పుడు ఆ ప్రస్తావన లేకపోవడంతో చర్చినీయాశంగా మారింది.
Moviesబన్నీ ముందు మెగా ఫ్యామిలీకి చోటే లేదు బ్రదర్.. !
బన్నీ ముందు మెగా ఫ్యామిలీకి చోటే లేదు బ్రదర్.. !
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి
- Tags
- allu arjuna
- allu family
- Chiranjeevi
- enjoying news
- entertaining news
- entertainment news
- exciting news
- filmy updates
- genuine news
- intresting news
- intresting updates
- journalist excluisve
- Latest News
- latest trending news
- mega family
- pushpa
- pushpa 2
- social media
- star hero
- star heroine
- super news
- Tollywood
- tollywood filmy updated news
- very useful news
- viral news