హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంథ్య థియేటర్లో పుష్ప సినిమా ప్రీమియర్ల సందర్భంగా అల్లు అర్జున్ స్వయంగా షోకు రావడం.. అక్కడ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో పాటు ఆమె కుమారుడు హాస్పటల్లో చికిత్స పొందుతోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రోజు రోజుకు ఈ సమస్య సైడ్ ట్రాక్ పడుతోన్న పరిస్థితి. ఇటీవల పరిణామాలు .. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా హీరో అల్లు అర్జున్‌పై తీవ్ర విమర్శలు చేయడం.. కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న లాంటి వాళ్లు అల్లు అర్జున్‌పై తీవ్ర విమర్శలు చేయడం.. ఇటు బీఆర్ఎస్ వాళ్లు బన్నీకి సపోర్ట్ చేయడం.. పెద్ద రచ్చ నడుస్తోంది.
ఇక రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మరుసటి రోజే బన్నీ ప్రెస్‌మీట్ పెట్టి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకపోయినా నామీద ఆరోపణలు అన్నీ ఫాల్స్ అంటూ కొడ్డి పడేశాడు. ఇక పోలీస్ అధికారులు చెపుతోన్న సమాచారాన్ని బట్టి వాస్తవాలు అన్నీ క్లీయర్ కట్‌గా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇక అక్కడ మహిళ మృతి చెందింది.. మరో పిల్లాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల్ని చితగ్గొట్టినందుకే పుష్పలో బన్నీకి నేషనల్ అవార్డు ఇచ్చారా ? అని ఓ పోలీస్ అధికారి వ్యంగ్య బాణాలు సంధించాడు.
ఇప్పుడు సమస్య పుష్ప సినిమాలో పోలీస్ అధికారుల పాత్రల్ని చూపించిన విధానంపైనా? బన్నీకి నేషనల్ అవార్డు ఇచ్చిన ప్రక్రియపైనా ? కూడా విమర్శలు స్టార్ట్ అవుతున్నాయి. అసలు సమస్య పక్కదారి పట్టేసింది. సినిమాలో ఏం ఉందని రాయితీలు ఇవ్వాలి ? ఎందుకు స్పెషల్ షోకు పర్మిషన్లు ఇవ్వాలి ? రేట్లు పెంచుకునేందుకు ఎందుకు అనుమతులు ఇవ్వాలని ఓ మంత్రి స్వయంగా ప్రశ్నించారు. ఇంత దిక్కుమాలిన సినిమాని నేనెప్పుడూ చూడలేదు ? అని ఓ పార్టీ అధినేత ఆవేదన .. ఇక బన్నీ ఇంటి మీదకు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇలా ఏదైనా కూడా అసలు ఇష్యూ పూర్తిగా పక్క దారి పట్టేసింది.