టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప-2. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తూ రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా స్టన్నింగ్ కలెక్షన్స్ రాబడుతూ ఇంకా రికార్డుల మోతతో బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది.
అల్లు అర్జున్ నట విశ్వరూపానికి ప్రేక్షకులు ఓ రేంజ్‌లో ఫిదా అవుతున్నారు. ఈ సినిమాకు సౌత్‌తో పాటు నార్త్ లో కూడా వీరంగం ఆడేస్తోంది. ఈ క్రమంలోనే పుష్ప-2 సినిమా హైదరాబాద్‌లో ఓ అరుదైన ఫీట్ సాధించింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో గత 23 ఏళ్లుగా ఉన్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రికార్డును బద్దలుకొట్టింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవర్‌గ్రీన్ క్లాసిక్ మూవీ ఖుషి ఈ థియేటర్లో లాంగ్ రన్ లో రూ.1.53 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ రికార్డును ఇప్పుడు పుష్ప 2 క్రాస్ చేసింది. కేవలం నాలుగు వారాల్లోనే పుష్ప-2 ఇక్కడ రూ.1.59 కోట్లు వసూళ్లు చేసింది. అయితే ఖుషి ఎప్పుడో 24 ఏళ్ల క్రితం వచ్చింది. అప్పటి టిక్కెట్ రేట్లు… ఇప్పటి టిక్కెట్ రేట్లు పోల్చి చూస్తే నిజంగా ఖుషి సినిమా వసూళ్లే చాలా గ్రేట్ అని చెప్పాలి.