Moviesమ‌నోజ్ వైపు త‌ల్లి నిర్మ‌ల‌... విష్ణుకు స‌పోర్ట్‌గా తండ్రి మోహ‌న్‌బాబు...!

మ‌నోజ్ వైపు త‌ల్లి నిర్మ‌ల‌… విష్ణుకు స‌పోర్ట్‌గా తండ్రి మోహ‌న్‌బాబు…!

మంచు మోహన్ బాబు కుటుంబం టాలీవుడ్లో క్రమశిక్షణకు పెట్టింది పేరు. అలాంటి కుటుంబం ఇప్పుడు బజారున పడింది. తండ్రి మీద కొడుకు.. కొడుకు మీద తండ్రి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. అసలు మంచు కుటుంబంలో ఏం జరుగుతుంది ? ఆస్తుల కోసమేనా అంతకుమించి ఏమన్నా జరిగిందా అన్నదానిపై విశ్వస నీయ‌ వర్గాల సమాచారం ప్రకారం ఒక విషయం బయటకు వచ్చింది. కొన్నాళ్లుగా మంచి విష్ణు కుటుంబం తండ్రి తో క‌లిసి ఒకే ఇంట్లోనే ఉంటుంది. శంషాబాద్ దగ్గరలో ఆ ఇంట్లో ఉంటున్నారు. అక్కడ మొదట నుంచి పనిచేసే వర్కర్లు ఉన్నారు. మనోజ్ అతని భార్య మౌనిక వైపు నుంచి పని వాళ్లు కూడా వచ్చారట.Mohan Babu Speech at Manchu Vishnu's Press Meet | Mohan Babu:  'రెచ్చగొట్టాలని చూశారు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు..' మోహన్ బాబు ఫైర్..ఈ క్రమంలోనే మోహన్ బాబుకు బాగా సేవలు చేసే ఒక మేల్ వర్కర్ కు మనోజ్ కుటుంబానికి సేవలు చేసే ఓ లేడీ వర్కర్ కు మధ్య ఏదో జరిగిందట. ఈ విషయంలో మోహన్ బాబుకు సన్నిహితంగా ఉన్న ఆ మేలు వర్కర్ను మనోజ్ కొట్టడంతో అతడు కొద్ది రోజులుగా డ్యూటీకి రావడం లేదట. మోహన్ బాబు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది .. దీంతో తన వర్కర్ ను కొడతావా అంటూ కొడుకుతో మోహన్ బాబుకు గొడవ ప్రారంభమైనట్టు సమాచారం. ఆ గొడవలు మోహన్ బాబు తన భార్య నిర్మలమ్మను కూడా మందలిం చినట్టు తెలుస్తోంది.Nirmala Devi Manchuనీ వల్లే మనోజ్ ని ఇంట్లోకి రానిచ్చాను అని మోహన్ బాబు అంటే .. నిర్మల మ్మ కూడా మనోజ్ కు సపోర్ట్ చేసినట్టు టాక్. మనోజ్ తన తల్లి మీదకే వెళతావా ? అని తండ్రితో పెద్దగా గొడవపడినట్టు సమాచారం. ఇలా మొత్తం ఈ చిన్న విషయం చినుకు చినుకు గాలి వానలా మారింది .. అది కాస్త పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఇది ఇక్కడితో ఆగితే మంచు కుటుంబ గౌరవం నిలబడుతుంది .. లేదంటే మీడియా చిలువలు పలువులుగా రాయటం ఆగదు. మరో విషయం ఏంటంటే ఈ వార్ లో తండ్రి పెద్ద కొడుకు విష్ణు వైపు ఉంటే .. భార్య నిర్మ‌ల‌మ్మ మ‌నోజ్ వైపు నిల‌బ‌డిన‌ట్టు టాక్ ?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news