నందమూరి నటసింహ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా ఇప్పటికే ప్రారంభం కావలసి ఉంది. ఈ సినిమా ఆగిపోయింది అన్న ప్రచారం బయటికి వచ్చిన అందులో ఎలాంటి వాస్తవం లేదని నిర్మాతలు తేల్చి చెప్పారు. సినిమా ఖచ్చితంగా ఉంటుందని త్వరలోనే ప్రారంభం అవుతుందని చెబుతున్న ఎప్పుడు ? సెట్స్ మీదకు వెళుతుందో అని నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
ఇది ఇలా ఉంటే మోక్షజ్ఞ తో సినిమాలు చేయడం కోసం చాలా మంది డైరెక్టర్లు వెయిటింగ్ లో ఉన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో మోక్షజ్ఞ ఒక సినిమా చేస్తాడనే ప్రచారం తెరమీదకు వచ్చింది. అలాగే బాలయ్య తో ప్రస్తుతం డాకు మహారాజ్ సినిమా చేస్తున్న బాబి మోక్షజ్ఞ గురించి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డాకు మహారాజ్ ప్రమోషన్లలో బాబి మోక్షజ్ఞ గురించి మాట్లాడారు. మోక్షజ్ఞ ఐదు ఆరుసార్లు లొకేషన్ కి వచ్చారు .. ఆరు అడుగుల హైట్ పర్ఫెక్ట్ లుక్ తో ఉంటాడు. షార్ప్ ఫీచర్స్ అతడిలో ఉన్నాయి .. అందరి దగ్గర ఒదిగి ఉంటాడు .. అలాగే ఏదైనా నేర్చుకోవాలని తపన కూడా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పాడు.
ముఖ్యంగా ఏ దర్శకుడి కి అయిన మోక్షజ్ఞ లాంటి కుర్రాడు దొరికితే ఖచ్చితంగా సినిమా చేయాలని ఉంటుంది .. అతనితో సినిమా చేసే అవకాశం వస్తే ఎప్పటికీ వదులుకోను అంటూ మోక్షజ్ఞ గురించి బాబి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాబి లాంటి మాస్ డైరెక్టర్ తో మోక్షజ్ఞ సినిమా పడితే కచ్చితంగా మాస్ జనాలకు మంచి ఫీస్ట్ అవుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. నందమూరి అభిమానులు మోక్షజ్ఞ మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరంలో మరో వారసుడు కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.