Movies' డాకూ మ‌హారా 'జ్ బుకింగ్స్ స్టార్ట్‌ ... ఎన్ని షోలు.....

‘ డాకూ మ‌హారా ‘జ్ బుకింగ్స్ స్టార్ట్‌ … ఎన్ని షోలు.. ఎక్క‌డెక్క‌డ‌..?

నంద‌మూరి న‌ట‌సింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ సాలిడ్ మాస్ సినిమా డాకు మహారాజ్. బాల‌య్య న‌టించిన మూడు సినిమాలు వ‌రుస‌గా సూప‌ర్ డూప‌ర్ హిట్ కావ‌డంతో ఈ డాకూ మ‌హారాజ్ సినిమాపై మరి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ బాలయ్యకి డ‌బుల్‌ హ్యాట్రిక్ కు బాట వేయాల‌ని కోరుకుంటున్నారు.

యూఎస్ బుకింగ్స్ కి సంబంధించి కొత్త అప్‌డేట్‌ ఇపుడు వ‌చ్చింది. డాకు మహారాజ్ లేటెస్ట్ గా యూఎస్ లో బుకింగ్స్ ని ఓపెన్ చేసుకుంది. ఇప్ప‌టికే 29 ప్రాంతాల్లో 77 షోల బుకింగ్స్ మొదలయ్యాయి. ఇక నెక్స్ట్ మరిన్ని ప్రాంతాల్లో కూడా బుకింగ్స్ స్టార్ట్ కానున్నాయి. ఏదేమైనా డాకు మహారాజ్ యూఎస్ మార్కెట్ లో మంచి ఓపెనింగ్స్ ని అందుకునే ఛాన్స్ ఉంది.

Daku Maharaj 💥🔥 #nandamuribalakrishna @director.bobby @nagavamsi19  @sitharaentertainments @fortune4cinemas @musicthaman #dakumaharaj  #dakumaharajteaser #balakrishna #newmovie #newpost #tollywood  #tollywoodactress #trending #movies #newpost #photoshop ...

ఇటు ఏపీ, తెలంగాణ‌లోనూ ఈ సినిమాకు భారీ బ‌జ్ ఉంది. ఈ సినిమాకు ఎస్‌.ఎస్‌. థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం వహిస్తున్నాయి. సంక్రాంతి కానుక‌గా జనవరి 12న సినిమా రిలీజ్ కి రాబోతుంది.

Latest news