గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా అదిరిపోయే మల్టీస్టారర్ సినిమా త్రిబుల్ ఆర్ తెరకెక్కించారు. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రౌద్రం – రణం – రుధిరం పేరుతో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో అటు రామ్ చరణ్ కు ఇటు ఎన్టీఆర్ ఇద్దరికీ కూడా మంచి పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. ఈ సినిమాతో రాజమౌళి కూడా గ్లోబల్ దర్శకుడుగా మారిపోగా .. ఇప్పుడు అందరూ రాజమౌళి నుంచి వస్తున్న మహేష్ బాబు సినిమా కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక రాజమౌళి డ్రీమ్ మహాభారతం.రాజమౌళి నుంచి అవైటెడ్ డ్రీం ప్రాజెక్టు ఆయన మహాభారతం ఎప్పుడు ఎప్పుడు ? వస్తుందా అని ఎదురుచూసే కోట్లాదిమంది సినీ ప్రేమికులు ఉన్నారు. తన పిరియాడిక్ సినిమాల్లో చాలా వరకు మహాభారతం ఇతిహాసాల పాత్రను ప్రేరణ గానే కొన్ని పాత్రలు చేస్తూ ఉంటానని రాజమౌళి ఇదివరకే ప్రకటించారు. ఇలాగే త్రిబుల్ ఆర్ సినిమాలో కూడా చేసినట్టు లేటెస్ట్ డాక్యుమెంటరీ సినిమాలో రివీల్ చేశారు. రాజమౌళి ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ఆసక్తి రేపింది. తన డ్రీం ప్రాజెక్టు మహాభారతం చేసేందుకు త్రిబుల్ ఆర్ అనేది ఒక అడుగు దూరంలోకి తీసుకువచ్చింది అని తెలిపారు.
దీంతో ఈ సినిమాకి తనకి ఎంత స్పెషల్ అనేది అర్థం చేసుకోవచ్చు. మరి మహేష్ బాబు సినిమా తర్వాత రాజమౌళి అల్లు అర్జున్‌తో సినిమా చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా చేస్తారా లేదా మహాభారతాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్తారా అన్నది చూడాలి. మహాభారతం సెట్స్ మీదకు వెళితే అది ఒకటి రెండు సినిమాలుగా అయిపోదని .. కనీసం ఐదారు సినిమాలుగా తెరకెక్కించాలని రాజమౌళి ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
మహేష్‌బాబు సినిమా తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ అదే… ఇండియన్ అవైటెడ్ సినిమా..!
