Movies' పుష్ప 2 ' ను చంద్రబాబు, రేవంత్ రెడ్డి గట్టెక్కిస్తారా.....

‘ పుష్ప 2 ‘ ను చంద్రబాబు, రేవంత్ రెడ్డి గట్టెక్కిస్తారా.. లేకపోతే బన్నీకి కష్టమే..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషన్ పుష్ప‌ పార్ట్ 2. ఈ సినిమా వచ్చేవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 36 నెలలు.. మూడు సంవత్సరాలు పాటు.. పుష్ప 2 సినిమా కోసం.. భారతీయ సినిమా ప్రేమికులు అందరూ కళ్ళు కాయలు కాచేలా.. ఇంకా చెప్పాలంటే కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్న పరిస్థితి. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్‌గా వచ్చిన పుష్ప సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆపటి నుంచి పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 ఎప్పుడు వస్తుందా.. ఎప్పుడు చూద్దామా ? అని అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.Pushpa 2: Allu Arjun And Rashmika Mandanna's Movie Collects Rs 900 Crore In  Pre-Release Business | Reportఎట్టకేలకు ఆరోజు వచ్చేసింది. డిసెంబర్ 5న పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. రిలీజ్‌కి ముందు ఈ సినిమాకు వస్తున్న హైప్‌ చూస్తుంటే.. సినిమా కనీ..వినీ.. ఎరగని రేంజ్ లో హిట్ అవుతుందని అందరూ ధీమాతో ఉన్నారు. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ టార్గెట్ ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పుష్ప 2 బ్రేక్ ఈవెన్‌కు చేరుకోవాలంటే ఈ సినిమా ఏకంగా రూ.212 కోట్ల మేర వసూళ్లు సాధించాల్సి ఉంది. అది కూడా షేర్ కావడం విశేషం. అంటే.. ఈ లెక్కన కనీసం రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వస్తే తప్ప పుష్ప 2 ఏపీ, తెలంగాణలో బ్రేక్ ఈవెన్ కాని పరిస్థితి ఉంది.alluarjun_online03 | Leaked pic still ! @alluarjunonline #alluarjun  #alluarjunonline #pushpa | Instagramపుష్ప 2 కేవలం ఏపీ, తెలంగాణలో రూ.212 కోట్ల షేర్ రాబట్టటం అంటే మామూలు విషయం కాదు. కచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పుష్ప‌ 2 సినిమాకు టికెట్ రేట్లు పెంచుకొని అవకాశం ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో కాస్త కనికరం చూపిస్తే తప్ప.. బన్నీ ఏపీ, తెలంగాణలో ఇంత పెద్ద టార్గెట్ గట్టెక్కే అవకాశం అయితే లేదు. సినిమాకు ఎంత సూపర్ హిట్ టాక్‌ వచ్చినా.. ఖచ్చితంగా రేట్లు ఎక్కువగానే ఉండాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news