Moviesనాగార్జున జాత‌కం మారిందా... అక్కినేని ప‌వ‌ర్ ఇప్పుడు చూస్తామా..?

నాగార్జున జాత‌కం మారిందా… అక్కినేని ప‌వ‌ర్ ఇప్పుడు చూస్తామా..?

ఎందుకో గాని గత కొంతకాలంగా అక్కినేని కుటుంబానికి కాలం కలిసి రావడం లేదు. అటు నాగార్జునతో పాటు ఇటు ఇద్దరు కుమారులు నాగచైతన్య – అఖిల్ నటించిన సినిమాలు వరుస పెట్టి డిజాస్టర్లు అవుతున్నాయి. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇది కదా సినిమా అంటే అని చెప్పుకునే సినిమా ఒక్కటి కూడా గత కొన్నేళ్లలో లేదు. అందరూ ఒకరిని మించిన డిజాస్టర్లు ఇస్తున్నారు. ఇక కెరీర్ పరంగాను వీరికి ఇబ్బందులు చెప్పటం లేదు. నాగచైతన్య – సమంత వైవాహిక జీవితం విచ్ఛిన్నం అయ్యింది. అఖిల్ కు శ్రీయ భూపాల్‌తో ఎంగేజ్మెంట్ జరిగాక పెళ్లి క్యాన్సిల్ అయింది. ఇది జరిగి కూడా నాలుగేళ్లు దాటింది. అటు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేయటం ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు డ్యామేజ్ అయింది. ఇలా అక్కినేని ఫ్యామిలీకి ఏది కలిసి రావటం లేదు. అలాంటి టైంలో ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీకి కాలం కలిసి వస్తున్నట్టుగా ఉంది. వరుసగా కుటుంబం నుంచి శుభవార్తలు అందుతున్నాయిकटरीना-कियारा के बाद शोभिता रचाएंगी राजस्थान में शादी, नागा चैतन्य संग ढूंढ रहीं वेन्यू? - Sobhita dhulipala and naga chaitanya planning rajasthan destination wedding know details ...ఇటీవల నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల‌తో ఎంగేజ్మెంట్ జరిగింది. డిసెంబర్ 5న వీరిద్దరి పెళ్లి జరగబోతుంది. ఈలోగా ఇదే కుటుంబం నుంచి మరో శుభవార్త వచ్చింది. అఖిల్ కూడా త్వరలో ఇంటి వాడవుతున్నాడు. ఢిల్లీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్… వ్యాపారవేత్త జైనాబ్ ర‌వ్జ్‌దేతో అఖిల్ ఎంగేజ్మెంట్ నిన్న సింపుల్ గా జరిగింది. ఈ ఫోటోలను నాగార్జున సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే ఈ పెళ్లి ఎప్పుడు అన్నది చెప్పలేదు. 2005 సంక్రాంతి తర్వాత ఉండవచ్చు అన్న ఊ హాగానాలు వినిపిస్తున్నాయి. జైనాబ్ విష‌యానికి వస్తే ఆమె కుటుంబం ముంబైలో సెటిల్ అయ్యారు.Real reason why Nagarjuna's son Akhil Akkineni, Shriya Bhupal called off wedding? | Telugu News - The Indian Expressఆమెకు చిత్రలేఖనం ప్రావీణ్యం ఉంది. దేశ విదేశాల్లో ఆమె ఎగ్జిబిషన్లో కూడా నిర్వహించారు.. వాళ్ళ పరిచయం ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాలు పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చైతన్న‌ స్పీడ్ గా ఉన్న వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.. సమంతతో విడాకుల తర్వాత డిస్టర్బ్ అయ్యాడు. ఇప్పుడు రెండో పెళ్లితో చైతు లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఇక అఖిల్ కూడా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వటం.. ఆ తర్వాత వరుస డిజాస్టర్ తో డిస్టర్బ్ అయ్యాడు.. ఇప్పుడు అఖిల్ కూడా ఓ ఇంటి వాడు అయితే అతని కెరీర్ గాడిలో పడుతుందని నాగార్జున భావిస్తున్నాడు. చైతు – అఖిల్ వ్యక్తిగత జీవితంలో సెట్ అయ్యి కెరీర్ పరంగా ఒకటి రెండు హిట్లు కొడితే నాగార్జునకు అంతకుమించి కావాల్సింది ఏముంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news