చెన్నై సోయగం త్రిష గురించి పరిచయాలు అవసరం లేదు. ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలోనూ భారీ స్టార్డమ్ సంపాదించుకున్న హీరోయిన్ల జాబితాలో త్రిష ఒకరు. పైగా సుధీర్గకాలం నుంచి ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతోంది. ఒకవైపు హీరోల పక్కన కమర్షియల్ చిత్రాలు చేస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్, వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా త్రిషకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఓ స్టార్ హీరోపై ఉన్న పిచ్చ అభిమానంతోనే కెరీర్ లోనే తొలిసారి ఐటెం సాంగ్ చేసేందుకు త్రిష ఒప్పుకుందట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు దళపతి విజయ్. త్వరలోనే విజయ్ గోట్(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) అనే మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.
సైన్స్ ఫిక్షన్, దేశభక్తి ప్రధానాంశాలుగా తీసుకుని ప్రముఖ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో తండ్రీకొడుకులుగా విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. మీనాక్షి చౌదరి, స్నేహా, లైలా, ప్రశాంత్, ప్రభు దేవా తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. సెప్టెంబర్ 5న భారీ అంచనాల నడుమ అట్టహాసంగా గోట్ మూవీ విడుదల కాబోతోంది.
అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందట. ఆ సాంగ్ లో విజయ్ తో కలిసి త్రిష ఆడిపాడిందని కోలీవుడ్ లో పెద్ద ఎత్తున్న ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారని కూడా అంటున్నారు. కాగా, తమిళంలో విజయ్-త్రిష హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరు జంటగా నటించిన ఐదు సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇప్పుడు ఈ హిట్ సెంటిమెంట్ ను రిపేట్ చేయడం కోసమే త్రిష చేత స్పెషల్ సాంగ్ చేయించారని.. అంతకుగానూ ఆమెకు భారీ మొత్తంలోనూ రెమ్యునరేషన్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.