ప్రస్తుత రోజుల్లో హిట్ టాక్ వచ్చినా కూడా కొన్ని సినిమాలు బ్రేక్ ఈవెన్ అవ్వడం లేదు. అలాంటిది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఓ చిత్రం తొలి ఆట నుంచే ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. కానీ ఫుల్ రన్ లో క్లీన్ హిట్ గా నిలిచింది. ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా.. నిజం. అవును మీరు విన్నది నిజమే. మహేష్ బాబు హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా
ఈ సినిమాలో రక్షిత హీరోయిన్ గా నటిస్తే.. గోపీచంద్ విలన్ గా చేశాడు. తాళ్ళూరి రామేశ్వరి, రంగనాథ్, ప్రకాష్ రాజ్, రాశి తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. చిత్రం మూవీస్ బ్యానర్ పై నిజం సినిమాను తేజ స్వయంగా నిర్మించారు. ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం 2003లో విడుదలైన నిజం నెగటివ్ టాక్ ను మూటగట్టుకుంది.
కానీ బాక్సాఫీస్ వద్ద కొన్ని మెరుపులు మెరిపించింది. ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ నిజం సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ తేజ స్వయంగా రివీల్ చేశాడు. అనుకున్న స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోవడంతో నిజం మూవీ ఫ్లాప్ అని అందరూ అనుకుంటున్నారు. అయితే వాస్తవానికి అప్పట్లో నిజం 71 కేంద్రాల్లో 50 రోజులు, 13 కేంద్రాల్లో 100 రోజులు ఆడిందట.
అలాగే ఫుల్ రన్ లో రూ. 10 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టి కమర్షియల్ గా హిట్ అయిందని తేజ తెలిపారు. కాగా, నిజం సినిమా ద్వారా నటుడిగా మహేష్ బాబు మరో రెండు మెట్లు ఎక్కాడు. విమర్శకులు సైతం మహేష్ బాబు యాక్టింగ్ పై ప్రశంసలు కురిపంచారు. ఇక గోపిచంద్ విలనిజం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేవుడు పాత్రలో ఆయన ప్రేక్షకులను ఓ రేంజ్ లో బయటపెట్టేశారు.