ఈ ఆగస్టు 15 కానుకగా తెలుగుతో పాటు హిందీలు పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తెలుగు నాట అయితే ఏకంగా మూడు డైరెక్ట్ సినిమాలతో పాటు మరో డబ్బింగ్ సినిమా తంగలాన్ రిలీజ్ అయ్యింది. ఇవన్నీ కూడా మంచి బజ్‌తో వచ్చి తొలి రోజు డీసెంట్ నంబర్స్ నమోదు చేశాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్లో కూడా మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. స్టార్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించిన ‘స్త్రీ-2’ – జాన్ అబ్రహం ‘వేదా’ – అక్షయ్ కుమార్ ‘ఖేల్ ఖేల్ మే’ సినిమాలు ఒకేరోజున రిలీజ్ అయ్యాయి.
ఈ మూడు సినిమాల్లో శ్రద్ధాకపూర్ స్త్రీ 2 సినిమాకు అక్కడ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేశారు. గతంలో వచ్చిన స్త్రీ సినిమాకు సీక్వెల్‌గా స్త్రీ 2 సినిమా రిలీజ్ అయ్యింది. హర్రర్ సినిమాలకు బాలీవుడ్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే స్త్రీ 2 సినిమా సాలీడ్ బుకింగ్స్‌తో దూసుకు పోయింది. తొలి రోజు ఈ సినిమాకు ప్రీమియర్లు + డే 1 తో కలుపుకుని ఏకంగా రు. 64.80 కోట్ల మేర వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ పండితులు చెప్పారు
.అసలు హిందీ బెల్ట్‌లో 2024లో ఇది హయ్యస్ట్ తొలి రోజు కలెక్షన్స్‌గా నిలిచింది. స్టార్ హీరోల సినిమాల కంటే కూడా స్త్రీ 2 ఎక్కువ కలెక్షన్లు రాబట్టడం ఇది బీ టౌన్ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా నిలిచింది. గట్టి పోటీ మధ్యలో రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా రు. 64 కోట్ల వసూళ్లు రాబట్టింది అంటే… సోలోగా వచ్చి ఉంటే ఇంకే స్థాయిలో విధ్వంసం జరిగి ఉండేదో అన్న చర్చలు కూడా బీ టౌన్లో నడుస్తున్నాయి. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ తదితరులు నటించారు. ఈ సినిమాను అమర్ కౌశిక్ డైరెక్ట్ చేశారు.