Moviesఏంటీ.. అత‌ను వంట‌ల‌క్క కొడుకా.. న‌మ్మ‌డం కొంచెం క‌ష్ట‌మే!

ఏంటీ.. అత‌ను వంట‌ల‌క్క కొడుకా.. న‌మ్మ‌డం కొంచెం క‌ష్ట‌మే!

ప్రేమి విశ్వనాథ్ అంటే గుర్తుకు రావడం ఒక క్షణం ఆలస్యం అవ్వొచ్చేమో గానీ.. వంటలక్క అంటే మాత్రం తెలుగువారి మదిలో ఆమె రూపం టక్కున మెదులుతుంది. తెలుగు బుల్లితెరపై మెగా హిట్ అయిన సీరియల్స్ లిస్ట్ తీస్తే కార్తీకదీపం అగ్రస్థానంలో ఉంటుంది. టీఆర్పీ రేటింగ్స్ విషయంలో పెద్ద పెద్ద హీరోల సినిమాలను సైతం కార్తీకదీపం బీట్ చేసింది. 2017 నుంచి 2023 వరకు బుల్లితెరపై కార్తీకదీపం నెంబర్ వన్ సీరియల్ గా సత్తా చాటింది.

ఈ నేపథ్యంలోనే 2024లో కార్తీకదీపం 2ను కూడా ప్రారంభించారు. ఇక సీరియల్ లో వంటలక్కగా నటించిన మలయాళ నటి ప్రేమి విశ్వనాథ్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత‌లా పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. హీరోయిన్ల రేంజ్ లో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రేమి విశ్వనాథ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. డాక్టర్ టి.ఎస్‌. వినీత్ భట్ అనే ఆస్ట్రాలజర్ ను ఆమె వివాహం చేసుకున్నారు. ఈ దంప‌తుల కుమారుడు పేరు మ‌నుజిత్‌.

అయితే తాజాగా మ‌నుజిత్ త‌న త‌ల్లి ప్రేమి విశ్వ‌నాథ్ తో ఒక రీల్ చేసి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు. మామ్ అండ్ స‌న్ అనే క్యాప్ష‌న్ కూడా ఇచ్చాడు. ఈ రీల్ చూసి నెటిజ‌న్లు షాకైపోతున్నారు. సిక్స్ ఫీట్ హైట్ మ‌రియు సిక్స్ ప్యాక్ బాడీతో అచ్చం హీరో మాదిరి ఫిట్ గా స్టైలిష్ గా మ‌నుజిత్ క‌నిపిస్తున్నాడు. పైగా మ‌న వంట‌ల‌క్క‌కు మ‌నుజిత్ కొడుకంటే న‌మ్మ‌డం కొంచెం క‌ష్ట‌మే. ఎందుకంటే, వీరిద్ద‌రూ చూడ‌టానికి తల్లీకొడుకుల్లా కాకుండా బ్ర‌ద‌ర్ అండ్ సిస్ట‌ర్ లా ఉన్నారు. ఇదే విష‌యాన్ని నెటిజ‌న్లు కూడా చ‌ర్చించుకుంటున్నారు. వంట‌ల‌క్క‌ సంతూర్ మ‌మ్మీ అంటూ క్రేజీగా కామెంట్లు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news