Moviesబింబిసార ఫ్రీక్వెల్ చేతులు మారడానికి కారణం అదేనా..? ఆ పనికి మాలిన...

బింబిసార ఫ్రీక్వెల్ చేతులు మారడానికి కారణం అదేనా..? ఆ పనికి మాలిన పని వల్లే వశిష్టను కళ్యాణ్ రామ్ దూరం పెట్టాడా..?

ఈ మధ్యకాలంలో ఇది ఒక బాగా ట్రెండ్ గా మారిపోయింది . గతంలో తెరకెక్కించిన సినిమాలకు సీక్వెల్ పేరిట మరొక సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ లు.. రీజన్ ఏంటో తెలియదు కానీ అలా సీక్వెల్స్ పేరిట తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. కాగా కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన బింబిసారా సినిమాకు ఫ్రీక్వెల్ రాబోతుంది ఇదే విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించాడు కళ్యాణ్ రామ్ .

వశిష్ట దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన సోషియో ఫాంటసీ మూవీ బింబిసారా . బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ చిత్రంలో కళ్యాణ్రామ్ నటన కెవ్వు కేక అనే చెప్పాలి . ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుంది అంటూ గతంలోనే ప్రకటించారు . ఈ సినిమాకి సీక్వెల్ కాకుండా ఫ్రీక్వెల్ ని చేయనున్నారు . తాజాగా కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా బింబిసార ఫ్రీక్వెల్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రిలీజ్ చేశారు.

అయితే వశిష్ట కాకుండా అనిల్ పాదూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది . దీంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఎందుకు వశిష్ట కాకుండా అనిల్ పాదూరికి ఈ ఛాన్స్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్ ..? అనేది హాట్ గా ట్రెండ్ అవుతుంది . అయితే వశిష్ట పూర్తి ఇష్టపూర్వకంగానే అనిల్ పాదూరి దర్శకత్వంలో బింబిసార ఫ్రీక్వల్ తెరకెక్కబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది . ప్రెసెంట్ విశ్వంభర సినిమా షూట్ లో బిజీగా ఉన్న వశిష్ట.. తర్వాత కూడా బడా స్టార్స్ తో కమిట్ అయి ఉన్నాడు అని .. ఈ సినిమాని తెరకెక్కించాల్సి వస్తే లేట్ అయిపోతుంది అని ..ఆ కారణంగానే అనిల్ పాదూరికి ఛాన్స్ ఇచ్చాడట కళ్యాణ్ రామ్ . అయితే కొంతమంది ఇది తెలియక కళ్యాణ్ రామ్ తో వశిష్ట తో విభేదాలు అంటూ ప్రచారం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news