Moviesమ‌హేష్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఒక్క‌డు మూవీకి మొద‌ట అనుకున్న రెండు...

మ‌హేష్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఒక్క‌డు మూవీకి మొద‌ట అనుకున్న రెండు టైటిల్స్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో ఒక్కడు ఒకటి. అంతకు ముందు వరకు లవర్ బాయ్ ఇమేజ్ తో ఉన్న మహేష్ బాబు.. ఒక్కడు సినిమాతో మాస్ హీరోగా గుర్తింపు పొందాడు. ఈ రొమాంటిక్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీకి గుణశేఖర్ దర్శకత్వం వహించగా.. ఎంఎస్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హించారు. అలాగే మ‌హేష్ బాబుకు జోడిగా భూమిక చావ్లా హీరోయిన్ గా నటించింది.

Do you know what are the two titles of Mahesh's blockbuster hit Okkodu?

ప్రకాష్ రాజ్‌, ముఖేష్ రిషి, పరుచూరి వెంకటేశ్వరరావు, చంద్రమోహన్, తెలంగాణ శకుంతల తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూ. 9 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన ఒక్క‌డు సినిమా.. 2003లో విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి ఆట నుంచి విమర్శకుల నుంచి సానుకూల సమీక్షను అందుకుని వసూళ్ల‌ వర్షం కురిపించింది. ఫుల్ రన్ లో రూ. 39 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టింది.

అప్పటివరకు వచ్చిన మహేష్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఒక్కడు రికార్డును కూడా సృష్టించింది. కథ నేపథ్యం, గుణశేఖర గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, మహేష్ బాబు-భూమిక కెమిస్ట్రీ, మణిశర్మ అందించిన సంగీతం, చార్మినార్ సెట్ సినిమాకు మెయిన్ హైలెట్స్ గా నిలిచాయి. దాంతో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు సినిమాకు బ్ర‌హ్మ‌రథం ప‌ట్టాడు. విడుదల తర్వాత ఒక్క‌డు సినిమా ఎన్నో అవార్డులు సైతం ద‌క్కించుకుంది.

Do you know what are the two titles of Mahesh's blockbuster hit Okkodu?

ఇక‌పోతే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. ఈ సినిమాకు మొదట అనుకున్న టైటిల్ ఒక్కడు కాదు. కాస్టింగ్ ఎంపిక మొత్తం జరిగిపోయిన తర్వాత డైరెక్టర్ గుణశేఖర్ ఈ చిత్రానికి అతడే ఆమె సైన్యం అనే టైటిల్ ను అనుకున్నారు. విలన్ నుంచి హీరోయిన్ ను కాపాడటమే హీరో లక్ష్యం కాబట్టి కథకు పర్ఫెక్ట్ గా ఆ టైటిల్ సరిపోతుందని గుణ‌శేఖ‌ర్‌ భావించారు. కానీ అప్పటికే ఆ టైటిల్ ను ఎవరో రిజిస్టర్ చేయించుకున్నారు. ఎంత బతిమాలిన ఇవ్వలేదు. దాంతో గుణశేఖర్ కబడ్డీ అనే టైటిల్ పెడదామనుకున్నారు. అయితే అది కూడా కుదరలేదు. ఇక చివరకు ఆ రెండు టైటిల్స్ ను కాదని ఒక్కడు పేరు ఫిక్స్ చేశారు. ఏ ఒక్కరూ నో అన‌లేదు. టైటిల్ అందరికీ నచ్చింది.ఇక మృగరాజు వంటి ఫ్లాప్ అనంతరం గుణశేఖర్ తీసిన ఒక్కడు చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. మ‌హేష్ బాబుకు మాస్ ఇమేజ్ ను అందించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news