Moviesజాన్వీ క‌పూర్ మెడ‌లో ఉన్న ఆ నెక్లెస్ ధ‌రెంతో తెలుసా.. ఒక...

జాన్వీ క‌పూర్ మెడ‌లో ఉన్న ఆ నెక్లెస్ ధ‌రెంతో తెలుసా.. ఒక ల‌గ్జ‌రీ ఇల్లు కొనేయొచ్చు!

దివంగత నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తున్న సంగతి తెలిసిందే. అటు నార్త్ తో పాటు ఇటు సౌత్ లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ మెయింటైన్ చేస్తుంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. తాజాగా అంబానీ ఇంట జరుగుతున్న పెళ్లి వేడుకల్లో జాన్వీ క‌పూర్ సంద‌డి చేసింది. రిలయన్స్ అధినేత, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ త‌న ప్రియ‌స‌ఖి రాధిక మర్చంట్ తో ఏడ‌డుగులు వేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్ వేదిక‌గా జులై 12న అనంద్‌-రాధిక‌ల వివాహ వేడుక అనంత కాలాలు గుర్తుండిపోయేలా జ‌ర‌గ‌బోతోంది. మ‌రోవైపు ప్రీ వెడ్డింగ్‌ వేడుక‌లు అంబ‌రాన్ని అంటుతున్నాయి. ఈ వేడుక‌ల్లో దేశ, విదేశాల నుంచి అతిరథ మహారథులు వస్తున్నారు. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న చాలా మంది ప్రదర్శనలు ఇస్తున్నారు. తాజాగా ముంబైలోని యాంటిలియాలో గుజరాతీ సాంప్రదాయం ప్రకారం అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల మామేరు వేడుక ఘనంగా జరిగింది.

ఈ వేడుక‌లో చాలా మంది బాలీవుడ్ ఫిల్మ్ స్టార్స్ సంద‌డి చేశారు. అందాల సుంద‌రి జాన్వీ క‌పూర్ కూడా హాజ‌రైంది. ఇందుకోసం ఆరెంజ్‌, రెడ్‌, పింక్ మ‌రియు గోల్డ్ మిక్స్డ్ లో ఉన్న‌ ట్రెడిషనల్ లెహంగాను జాన్వీ ధ‌రించింది. డ్రెస్ కు సెట్ అయ్యే విధంగా మెడ‌లో అంద‌మైన‌ నెక్లెస్ ను పెట్టుకుంది. అయితే ఇప్పుడు ఆ నెక్లెస్ ధ‌ర నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

పెద్ద పెద్ద స్టోన్స్ తో చాలా అట్రాక్టివ్ గా క‌నిపిస్తున్న ఆ నెక్లెస్ హజారీలాల్ లీగసి జ్యువెలరీ బ్రాండ్ కి చెందినది. ఇక ఆ నెక్లెస్ ధ‌రెంతో తెలుసా.. అక్ష‌రాల రూ. 52 ల‌క్ష‌లు. అంటే అర కోటి పైమాటే. ఈ విష‌యం తెలుసుకున్న నెటిజ‌న్లు నోరెళ్ల‌బ‌డెతున్నారు. అర కోటితో సామాన్యుడు ఒక ల‌గ్జ‌రీ ఇల్లు కొనేసుకోవ‌చ్చ‌ని అంటున్నారు. ఏదేమైనా ప్రీ వెడ్డింగ్ వేడుక‌ల‌కే జాన్వీ అంత ఖ‌రీదైన నెక్లెస్ ధ‌రించిందంటే.. పెళ్లికి ఇంకెంత కాస్ట్లీ న‌గ‌లు ధ‌రిస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news