Moviesశ్రీకాంత్ కెరీర్‌లో అంత బ్యాడ్ టైం న‌డిచిందా... అస‌లేం జ‌రిగింది..?

శ్రీకాంత్ కెరీర్‌లో అంత బ్యాడ్ టైం న‌డిచిందా… అస‌లేం జ‌రిగింది..?

ఆయ‌న క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా సినీ రంగంలోకి అడుగు పెట్టారు. రామానాయుడు ఆయ‌న‌లో ఉన్న ప్ర‌తిభ‌ను గుర్తించి తాజ్‌మ‌హ‌ల్ సినిమాలో హీరోను చేశారు. ఇక‌, అప్ప‌టి నుంచి వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. ఈవీవీ స‌హా ఎంతో మంది ఆయ‌న‌ను ప్రోత్స‌హించారు. ఆయ‌నే శ్రీకాంత్‌. ఆమె(ఈఈవీ ద‌ర్శ‌కుడు) సినిమాతో కుటుంబ సినిమాల‌కు కూడా చేరువ అయ్యాడు. ఆమె హీరోయిన్ ఊహ‌ను వివాహం కూడా చేసుకున్నాడు.

ఇలా.. ఒకప్పుడు స్టార్‌ హీరోలకే గట్టి పోటీనిచ్చాడు. అయితే రానురాను శ్రీకాంత్‌ కెరీర్‌ డల్‌ అయింది. గత కొంతకాలంగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానే కనిపిస్తున్నాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న శ్రీకాంత్‌ టాలీవుడ్‌లో సెంచరీ మార్క్‌ను సులువుగా దాటేశాడు. అయితే.. అనూహ్యంగా ఎందుకు కెరీర్ డ‌ల్ అయిందనేది శ్రీకాంత్‌ను ఇప్ప‌టికీ ఆశ్చ‌ర్యంలో ఉంచిన విష‌యం.

‘ఆమె సినిమా హిట్టయింది. అప్పటికే తాజ్‌మహల్‌, పెళ్లి సందడి సినిమాలు కమిటయ్యాను. వాటితో పాటు ఆహ్వానం, వినోదం వంటి చిత్రాలన్నీ వరుసగా హిట్టయ్యాయి. అప్పటి నుంచి ఒక సినిమా రిలీజ్‌ అవుతుందంటే.. ఆ తర్వాత చేయడానికి మూడు సినిమాలు రిలీజ్‌గా ఉండేవి. హిట్‌ పడగానే పెద్దపెద్ద బ్యానర్లు వచ్చేవి. కానీ అప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తయ్యేసరికి ఈ పెద్ద బ్యానర్లు వెనక్కు వెళ్లిపోయేవి“ అని త‌న కెరీర్ గురించి చెప్పుకొచ్చాడు శ్రీకాంత్‌.

అయితే, 2009లో వ‌చ్చిన మహాత్మ సినిమా తర్వాత శ్రీకాంత్ దాదాపు తెర‌మ‌రుగ‌య్యాడు. ఇది ఆయ‌న‌ వందో సినిమా. దీని తర్వాత కెరీర్‌ నెమ్మదిగా కిందకు పడిపోయింది. మహాత్మ తర్వాత ఓ పాతిక సినిమాలు చేసినా.. ఏదీ విజయం సాధించలేదు. బహుశా టైం బ్యాడేమో.. కొత్తవాళ్లు ఇండస్ట్రీకి రావడం కూడా కార‌ణ‌మో.. ఇప్ప‌టికీ శ్రీకాంత్‌కు అంతుచిక్క‌డం లేద‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news