Moviesఇక ప్ర‌భాస్ కు పెళ్లి కాన‌ట్లే.. హాట్ టాపిక్ గా మారిన...

ఇక ప్ర‌భాస్ కు పెళ్లి కాన‌ట్లే.. హాట్ టాపిక్ గా మారిన శ్యామలాదేవి కామెంట్స్‌!

సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే మొదట గుర్తుకు వ‌చ్చే పేరు ప్ర‌భాస్‌. దాదాపు ద‌శాబ్దన్న‌ర కాలం నుంచి ప్ర‌భాస్ ఎప్పుడెప్పుడు పెళ్లి పీట‌లెక్కుతాడా అని అభిమానులు క‌ళ్ల‌లో ఒత్తులేసుకుని మ‌రీ చూస్తున్నారు. బాహుబ‌లి సీరిస్ త‌ర్వాత పెళ్లి చేసుకుంటాన‌ని గ‌తంలో ప్ర‌భాస్ చెప్పాడు. బాహుబ‌లి త‌ర్వాత సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌, స‌లార్, తాజాగా క‌ల్కి 2898 ఏడీ చిత్రం కూడా విడుద‌లైంది.

కానీ ప్ర‌భాస్ ఓ ఇంటివాడు మాత్రం కాలేదు. 44 ఏళ్లు వ‌చ్చినా పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. దీంతో ప్ర‌భాస్ కు పెళ్లి కాన‌ట్లే అంటూ ప్ర‌చారం మొద‌లైంది. ప‌లువురు జ్యోతిష్కులు ఒక అడుగు ముందుకేసి ప్ర‌భాస్ జాత‌కంలో పెళ్లి యోగం లేద‌ని సోష‌ల్ మీడియాలో హ‌డావుడి చేస్తున్నారు. అయితే తాజాగా ప్ర‌భాస్ పెళ్లిపై ఆయ‌న పెద్ద‌మ్మ‌, కృష్ణంరాజు గారి స‌తీమ‌ణి శ్యామ‌లాదేవి స్పందించారు.

క‌ల్కి 2898 ఏడీ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన నేప‌థ్యంలో తాజాగా శ్యామ‌లాదేవి ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ పెళ్లిపై ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. శ్యామ‌లాదేవి మాట్లాడుతూ.. బాహుబలి త‌ర్వాత ప్రభాస్ కు సక్సెస్ ఉండ‌ద‌ని.. అతనికి విజయాలు దక్కవని ఎందరో అన్నారు. కానీ ఎవ‌రు ఎన్ని మాట్లాడినా త‌న పని తాను చేసుకుంటూ వెళ్లాడు. తాను చేసే సినిమాలు ప్రేక్షకులకు నచ్చాల‌ని ఎంతో కష్టపడ్డాడు.

ఇప్పుడు క‌ల్కి తో స‌క్సెస్ అందుకుని అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేశాడు. అలాగే ప్రభాస్ పెళ్లి విషయంలోనూ అదే జరుగుతుంది. సమయం వచ్చినప్పుడు ప్రభాస్ పెళ్లి క‌చ్చితంగా జ‌రుగుతుంది. పైనుంచి కృష్ణంరాజు గారు అన్ని చూస్తూ ఉంటారు.. ప్రభాస్ లైఫ్ లో అంతా మంచే జ‌రుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news