Moviesనేడు మెగా మనవరాలు క్లీంకార పుట్టినరోజు.. స్పెషల్ వీడియోని షేర్ చేసిన...

నేడు మెగా మనవరాలు క్లీంకార పుట్టినరోజు.. స్పెషల్ వీడియోని షేర్ చేసిన ఉపాసన..!

క్లింకార.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తాత మెగాస్టార్ చిరంజీవి కన్నా .. తండ్రి రామ్ చరణ్ కన్నా సోషల్ మీడియాలో ఎక్కువగా మారుమ్రోగిపోయిన పేరు. మెగా మనవరాలు ..మెగా ప్రిన్సెస్ ఒకటి కాదు రెండు కాదు చాలా చాలా ముద్దు పేరుతో పిలుచుకుంటూ ఉంటారు అభిమానులు . దాదాపు పెళ్లయిన పదకండేళ్ల తర్వాత రామ్ చరణ్ ఉపాసనలకు పుట్టిన మొదటి సంతానం ఈ క్లీం కార.

సరిగ్గా నేటికి ఆమె పుట్టి సంవత్సరం కంప్లీట్ చేసుకుంది . ఈరోజు క్లింకార బర్త డే ఈ సందర్భంగా మెగా కోడలు ఉపాసన స్పెషల్ వీడియోని షేర్ చేసింది . ఆల్రెడీ ఈ వీడియో ఇంతకుముందే జనాలు చూసిన ..పుట్టినరోజు సందర్భంగా తన పాప పుట్టిన స్పెషల్ మూమెంట్స్ ని .. ఆ మూమెంట్స్ ని కుటుంబ సభ్యులు ఎలా ఎంజాయ్ చేశారు అన్నదాన్ని మరొకసారి వివరిస్తూ తన ఆనందాన్ని షేర్ చేసుకుంది.

సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ వీడియో బాగా వైరల్ గా మారింది . కాగా క్లింకార పుట్టి సంవత్సరం అవుతున్న ఇప్పటికీ ఆమె ఒరిజినల్ పిక్ రివిల్ చేయకపోవడం పట్ల మెగా ఫాన్స్ డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేస్తున్నారు . అయితే ఇవాళ అమ్మ పుట్టినరోజు సందర్భంగా ఎక్కడైనా ఒక పిక్చర్ అన్న లీక్ చేయకపోతారా అన్న ఆనందంలో ఉన్నారు మెగా ఫాన్స్ . చూద్దాం మరి ఏం జరుగుతుందో..? మెగా ఫ్యాన్స్ కూడా క్లీం కార బర్త డే ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండటం మరీ మరీ స్పెషల్ గా మారింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news