Moviesప్రశాంత్ నీల్ కి ధైర్యం ఎక్కువే.. ఎన్టీఆర్ చేత ఏకంగా అలాంటి...

ప్రశాంత్ నీల్ కి ధైర్యం ఎక్కువే.. ఎన్టీఆర్ చేత ఏకంగా అలాంటి పని చేయించబోతున్నాడుగా..గ్రేట్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ పాన్ ఇండియా లెవెల్ లో వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాల కోసం ఏమైనా చేస్తాడు . ఆ విషయం అందరికీ తెలిసిందే . తారక్ తనదైన స్టైల్ లో నటించి మెప్పిస్తాడు . కాగా రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఆఫ్ కోర్స్ ఈ సినిమా ఎప్పుడో కమిట్ అయ్యాడు . కానీ రీసెంట్ గానే ఈ సినిమా సెట్స్ పైకి తీసుకొచ్చె విషయం పై క్లారిటీ ఇచ్చాడు.

ప్రశాంత్ నీల్ ఆగస్టులో ఎన్టీఆర్ తో తెరకెక్కించే సినిమాను సెట్స్ పై తీసుకురాపోతున్నట్లు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రివీల్ చేశాడు . కాగా ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటించబోతున్నట్లు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది . అఫీషియల్ ప్రకటన ఒక్కటే తరువాయి . అయితే ఈ సినిమా కోసం కెరియర్ లో ఎప్పుడు చేయని పని చేయబోతున్నాడట జూనియర్ ఎన్టీఆర్ . ఏకంగా ఈ సినిమా షూటింగ్ 15 దేశాలలో ప్లాన్ చేశారట . ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పాటను తెరకెక్కించే విధంగా షూట్ చేస్తున్నారట . సోషల్ మీడియాలో ఈ న్యూస్ అద్దిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంటుంది . నందమూరి అభిమానులు ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు .

దీంతో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ డీటెయిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రజెంట్ ఎన్టీఆర్ దేవర అనే సినిమా షూట్లో ఉన్నాడు తారక్. అదే విధంగా వార్ 2 సినిమాను కూడా సెట్స్ పై కి తీసుకొచ్చాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే ప్రశాంత్ నీల్ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు తారక్. ఈ సినిమా లో కని విని ఎరుగని లుక్స్ లో కనిపించబోతున్నాడట తారక్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news