Moviesపవన్ కళ్యాణ్ - అకిరా నందన్ ఎప్పుడు కలిసిన ఎక్కువగా మాట్లాడుకునేది...

పవన్ కళ్యాణ్ – అకిరా నందన్ ఎప్పుడు కలిసిన ఎక్కువగా మాట్లాడుకునేది దాని గురించేనా..? తండ్రికి తగ్గ కొడుకే వీడు..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ పేరు ఏ రేంజ్ లో వైరల్ అయిపోతుందో మనం చూస్తున్నాం. అఫ్కోర్స్ మొదటినుంచి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అంటే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు జనాలు. కానీ ఈ మధ్యకాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లిన తన కొడుకుని వెంటపెట్టుకొని తీసుకెళ్తూ ఉండడంతో .. త్వరలోనే ఆయన వారసుడిగా అటు సినిమా ఇండస్ట్రీలో ఇటు రాజకీయాలలో దింపే ప్రయత్నం చేయబోతున్నారు అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి .

మరీ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అధికారం చేపట్టారు.. ఆ టైంలో పవన్ కళ్యాణ్ తన కొడుకుని ఎక్కడికి వెళ్లినా కూడా తీసుకెళ్లడం సంచలనంగా మారింది . అంతేకాకుండా సోషల్ మీడియాలో అకిరానందన్ సినిమా ఎంట్రీ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి . రీసెంట్గా వీళ్ళకి సంబంధించిన ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది . పవన్ కళ్యాణ్ అకిరానందన్ కలిసినప్పుడు ఎలా ఉంటారు ..ఎలా మాట్లాడుకుంటారు ..? తెలుగులో మాట్లాడుకుంటారా..? ఇంగ్లీష్ లో మాట్లాడుతారా ..? అనే విషయాలకు సంబంధించిన డీటెయిల్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.

గతంలో ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మాట్లాడుతూ ..”ఆద్య చాలా కమాండింగ్.. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఎప్పుడు కలుస్తావు అంటూ స్ట్రైట్ గా అడిగేసే టైప్ .. అకిరా అలా కాదు చాలా సైలెంట్ .. ఆద్య నేను మరాఠీలో మాట్లాడుతాను .. తనతో మరాఠీ లోనే మాట్లాడాలి అని కండిషన్ పెట్టింది ఆద్య.. అఖీరా మాత్రం ఎప్పుడూ తెలుగులోనే మాట్లాడుతాడు ..ఎందుకంటే వాళ్ళ నాన్న భాష అఖీరా మర్చిపోకూడదు కదా.. అకిరా పవన్ కళ్యాణ్ ఎప్పుడు కలిసినా కూడా తెలుగులోనే మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కువ లైఫ్ కి సంబంధించిన విషయాలు.. ఫిలాసఫీ కి సంబంధించినవి. మంచిగా ఎలా ఉండాలి అనే వాటి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు . అసలు వాళ్ల మధ్య సినిమా ప్రవర్తన అనేది రాదు “అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news