Moviesబాలయ్య బర్త డే ట్రీట్ వచ్చేసిందోచ్..ఫ్యాన్స్ కి రోమాలు నిక్కబొడుచుకునేలా NBK109...

బాలయ్య బర్త డే ట్రీట్ వచ్చేసిందోచ్..ఫ్యాన్స్ కి రోమాలు నిక్కబొడుచుకునేలా NBK109 స్పెషల్ గ్లింప్స్ (వీడియో)..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నరసిం హంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య పుట్టినరోజు నేడు. ఈ క్రమంలోనే ఆయనకు ఫ్యామిలీ మెంబర్స్ శ్రేయోభిలాషులు విష్ చేస్తున్నారు . ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు. కాగా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయన చేస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ని కూడా నెట్టింట బాగా ట్రెండ్ చేస్తున్నాను . మనకు తెలిసిందే మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా కి కమిట్ అయ్యాడు.. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు . ఈ గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకుంటుంది.

మొదటినుంచి ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు బాలయ్య అభిమానులు . ఆ అంచనాలను ఏం మాత్రం తక్కువ చేయకుండా బాబీ తనదైన స్టైల్ లో డైరెక్టర్ చేశారు అని చిన్న గ్లింప్స్ ద్వారానే తెలిసిపోతుంది . బాలయ్య పాత్ర చాలా ఎలివేషన్స్ ఉండేలా ఈ గ్లింప్స్ కట్ చేయడం హైలైట్ గా మారింది . అఖండ తరహాలోనే ఈ పాత్ర కూడా ఉండబోతుంది అని చెప్పకనే చెప్పేశారు . రిలీజ్ అయిన గ్లింప్స్ ఆధారంగా రాత్రి సమయంలో మంచు పొగలో విలన్ లు కత్తులు పట్టుకొని ఎవరినో వేటాడడానికి వెళ్తూ ఉంటారు . “ఈ క్రమంలో దేవుడు మంచివాడయ్యా దుర్మార్గులకు కూడా వరాలు ఇస్తాడు అంటూ వీళ్ళ అంతు చూడాలంటే కావాల్సింది జాలి-దయ-కరుణ..పదాలకు అర్థమే తెలియని అసురుడు అంటూ మకరన్ దేశ్ పాండే చెబుతూ ఉంటాడు “.

ఆ డైలాగ్స్ కి వెనకాల బీజీఎమ్ అద్దిరిపోతుంది . ఆ టైంలోనే బాలయ్య ఎంట్రీ ఇస్తాడు . బాలయ్య పాత్రకి ఎలివేషన్ అదిరిపోయేలా ఉంది . ఓ రైల్వే స్టేషన్ వద్ద మంచు పొగలో.. బాలకృష్ణ నడుచుకుంటూ చేతిలో బ్యాగ్ మరో చేతిలో పెట్టి ఉంటుంది.. అనంతరం ఓ అడవిలో మంటలు చెలరేగుతూ ఉండగా బాలయ్య అరుస్తూ గుర్రంపై స్వారీ చేయడం గూస్ బంప్స్ తెప్పిస్తుంది . గతంలో మాదిరిగా అరుస్తూ బారెడు డైలాగులు లేవు సింపుల్ గా పరిచయం చేశారు. అయితే హై వోల్టేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు .

సినిమాలో ఏదో సస్పెన్స్ దాస్తున్నారనే విషయం మాత్రం అర్థం అయిపోతుంది. రిలీజ్ అయిన గ్లింప్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది . అందుతున్న సమాచారం ప్రకారం “వీరమాస్” అనే టైటిల్ పెట్టబోతున్నారట .ప్రజెంట్ ఈ గ్లింప్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. మరి ఎందుకు ఆలస్యం గూస్ బంప్స్ తెప్పిస్తున్నా ఆ గ్లింప్స్ ను మీరు చూసేయ్యండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news