Movies"కల్కి" బ్లాక్ బస్టర్ హిట్ ..ట్రెండింగ్ లో బాలయ్య వీడియో.. అబ్బబ్బా...

“కల్కి” బ్లాక్ బస్టర్ హిట్ ..ట్రెండింగ్ లో బాలయ్య వీడియో.. అబ్బబ్బా ఈ నందమూరి ఫ్యాన్స్ భలే పాయింట్ పట్టేసారే..!

ప్రజెంట్ సోషల్ మీడియాలో నందమూరి బాలయ్య మాట్లాడిన వీడియో ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది. కల్కి సినిమాలోని క్యారెక్టర్స్ గురించి ముందుగానే తనదైన స్టైల్ లో మాట్లాడాడు నందమూరి బాలకృష్ణ . మనకు తెలిసిందే నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ మూవీ “కల్కి” . కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . మరి ముఖ్యంగా మన పురాణాలను బేస్ చేసుకుని నాగ్ అశ్వీన్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అన్న కాన్సెప్ట్ ని నేటి ప్రపంచానికి తెలిసే విధంగా టెక్నాలజీ ఉపయోగించి తెరకెక్కించిన ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంటుంది .

మరీ ముఖ్యంగా సినిమాలో విష్ణువు నుంచి అశ్వద్ధామ వరకు అదేవిధంగా అర్జునుడు ..భీముడు.. లాంటి పాత్రలను కూడా చూపించారు . అయితే ఆ పాత్రల గురించి తెలియకుండా.. ఆ పాత్రలకు ఉన్న రిలేషన్షిప్ ఏంటి ..?అనే విషయం అర్థం చేసుకోకుండా సినిమాకి వెళ్తే కచ్చితంగా జనాలకు రకరకాల ప్రశ్నలు ఎదురవుతాయి . ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ బాలకృష్ణకు సంబంధించిన ఒక వీడియోని బాగా ట్రెండ్ చేస్తున్నారు .

బాలయ్య గతంలో తెలుగు సినిమా ఈవెంట్లో మహాభారతంలోని పాత్రలు అన్నిటిని చెబుతూ ఒక స్కిట్ రూపంలో చేశారు. దానికి సంబంధించిన వీడియో ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు బాలయ్య అభిమానులు. మీరు కల్కి సినిమాకి వెళ్తుంటే ఈ వీడియో చూడండి ..మహాభారతంలోని పాత్రలకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ వీడియో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతూ ఉండడం గమనార్హం..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news