Moviesఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని బ్లాక్ డ్రెస్ అమ్మాయి ఎవరో...

ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని బ్లాక్ డ్రెస్ అమ్మాయి ఎవరో తెలుసా..? స్టార్ హీరోయిన్ కూతురే..!

ప్రజెంట్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అమ్మాయి ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది. సోషల్ మీడియాని మడత పెట్టేస్తుంది . యాక్షన్ హీరో అర్జున్ సార్జ పెద్ద కూతురు ఐశ్వర్య వివాహం చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది . లెజెండరీ నటుడు తంబి రామయ్య కుమారుడు హీరో ఉమాపతితో జూన్ 10వ తేదీ ఐశ్వర్య వివాహం జరిగింది. ఇరు కుటుంబాలు సహా అతి కొద్ది బంధువుల సమక్షంలో వీళ్ళ పెళ్లి జరిగింది . ఆ తర్వాత రిసెప్షన్ నిర్వహించారు .

ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. మరీ ముఖ్యంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ..సూపర్ స్టార్ రజినీకాంత్ ..డైరెక్టర్ శంకర్ .. ప్రభుదేవా ..లోకేష్ కనకరాజ్ …కుష్బూ ..విజయ్ సేతుపతి ..హీరోయిన్ స్నేహ లాంటి స్టార్స్ అటెండ్ అయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు . అయితే ఎంతమంది స్టార్స్ ఉన్నా సరే ఈ ఫంక్షన్ లో ఒక అమ్మాయి హైలెట్గా మారింది ..అట్రాక్షన్ గా ఉండింది .

ఎక్కడ చూసినా సరే అందరూ ఆ అమ్మాయి ఫోటోలు తీయడమే మొదలుపెట్టారు . ఐశ్వర్య పక్కనే బ్లాక్ ట్రెండి ట్రెడిషనల్ వేర్ లో చాలా చక్కగా నవ్వుతూ హీరోయిన్ కి మించిపోయిన రేంజ్ లో కనిపించింది. ఇప్పుడు ఆ బ్యూటీ ఎవరా..? అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు . ఆ బ్యూటీ మరెవరో కాదు సెలబ్రిటీ కూతురే. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా ..? కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ముద్దుల కూతురు అనౌష్క. ఐశ్వర్య రిసెప్షన్ వేడుకల్లో తల్లి శాలినితో కలిసి హాజరయ్యింది . చాలా చక్కగా అందరితో మాట్లాడింది అనౌష్క. ఆమె చాలా రేర్ గా బయట కనిపిస్తుంది . ఈ క్రమంలోనే ఆమె కనిపించి కనిపించగానే మీడియా ఫొటోస్ తీసి ఆమె ఫొటోస్ నిట్రెండ్ చేస్తుంది. ప్రజెంట్ అనౌష్క ఫొటోస్ బాగా వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news