Moviesఅన్ని విషయాలలో గలగల మాట్లాడేసే చరణ్ ..ఆ ఒక్క మ్యాటర్లోనే ఎందుకు...

అన్ని విషయాలలో గలగల మాట్లాడేసే చరణ్ ..ఆ ఒక్క మ్యాటర్లోనే ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు..?

రామ్ చరణ్.. అంటే అందరికీ ఒక స్పెషల్ ఇంప్రెషన్ ..ఏ విషయాన్నైనా సరే స్ట్రైట్ ఫార్వార్డ్ గా మాట్లాడుతాడు .. మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటాడు .. తన పని తాను చూసుకొని వెళుతూ ఉంటాడు ..ప్రజలకు సేవ చేస్తూ ఉంటాడు.. ఇతరులు కష్టపడితే అస్సలు చూడలేడు .. ఈ విషయాలు అందరికీ తెలిసిందే .. అయితే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక విషయంలో సైలెంట్ అయిపోయిన సంగతిని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. ఎందుకు రామ్ చరణ్ ఇంత సైలెంట్ అయిపోయాడు ..? అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా గేమ్ చేంజర్.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్న నమ్మకాలు మెగా ఫాన్స్ లలో ఎక్కువగా ఉన్నాయి. అయితే సినిమాకి సంబంధించి సరైన అప్డేట్స్ ఇవ్వడంలో శంకర్ ఫ్లాప్ అయ్యాడు అనే చెప్పాలి . సినిమా ఎప్పుడో స్టార్ట్ చేశారు రెండు సంవత్సరాలకు పైగానే షూటింగ్ చేశారు కానీ ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకపోవడం మెగా ఫాన్స్ ని హర్ట్ చేసింది .

కాగా సోషల్ మీడియాలో ఇప్పుడు చరణ్ ని చాలామంది ఫ్యాన్స్ అడిగేస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు? అసలు అనౌన్స్మెంట్లు ఏమీ రావట్లేదు ఎందుకు..? ఈ సినిమా విషయంలో నువ్వు సైలెంట్ గా ఉన్నావు చరణ్ అని స్ట్రైట్ గా ప్రశ్నిస్తున్నారు ..? జూనియర్ ఎన్టీఆర్ పక్కా క్లారిటీతో వెళ్తున్నాడు ..పుష్ప సినిమా విషయంలో అల్లు అర్జున్ సైతం ముందుకు వెళ్లి పోతున్నాడు .. ప్రభాస్ ఏకంగా మరికొద్ది రోజుల్లో తన సినిమాలు రిలీజ్ చేయబోతున్నాడు .. కానీ నువ్వేంటి అసలు ఏం పట్టించుకోవట్లేదు .. ఎందుకు సైలెంట్ గా ఉన్నావ్ అంటూ స్ట్రైట్ గా ప్రశ్నిస్తున్నారు . చూద్దాం మరి రామ్ చరణ్ సమాధానం ఎలా ఉండబోతుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news