Moviesఆ ఒక్క నిర్ణయంతో .. స్టార్ట్ డైరెక్టర్లకు కొత్త తలనొప్పులు క్రియేట్...

ఆ ఒక్క నిర్ణయంతో .. స్టార్ట్ డైరెక్టర్లకు కొత్త తలనొప్పులు క్రియేట్ చేసిన అల్లు అర్జున్..!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో మనం చూస్తూనే ఉన్నాము. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఓ రేంజ్ లో పాపులారిటీ దక్కించేసుకున్నాడు . అంతకుముందు కూడా అల్లు అర్జున్ అంటే అందరికీ ఓ మంచి అభిప్రాయమే కానీ ..పుష్ప సినిమాతో ఆ మంచితనాన్ని వందరెట్లు పెంచేసుకున్నాడు ఈ ఐకాన్ స్టార్.

ప్రజెంట్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . రీసెంట్గా అల్లు అర్జున్కి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8వ తేదీ . ఈరోజు కచ్చితంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయి అంటూ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు . పుష్ప2 సినిమా నుంచి అయితే భారీ స్థాయిలో అభిమానులకు సర్ప్రైజ్ రాబోతుందట .

ఇదేవిధంగా అల్లు అర్జున్ నెక్స్ట్ కనెక్ట్ అయిన సినిమాలకు సంబంధించి గుడ్ న్యూస్ లు కూడా వినబోతున్నాం అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. కాగా అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాలో త్రివిక్రమ్ తో కమిట్ అయ్యాడు అంటూ ప్రచారం జరుగుతుంది . అదేవిధంగా అట్లీకి కూడా మాట ఇచ్చాడు అంటూ ఓ న్యుస్ ట్రెండ్ అవుతుంది. అదే విధంగా బోయపాటి శ్రీను కూడా లిస్టులో ఉన్నట్లు తెలుస్తుంది .

కానీ నెక్స్ట్ సినిమాను వెంటనే ఏ డైరెక్టర్ తో తెరకెక్కిస్తాడు అనేది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే అల్లు అర్జున్ మాత్రం తన బర్త్డ డేకి సంబంధించిన అప్డేట్ కేవలం పుష్ప2ది మాత్రమే అయ్యి ఉండాలి అని మిగతా ఏ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు ఇవ్వకూడదు అని మేకర్స్ ను రిక్వెస్ట్ చేశారట . అంతేకాదు పుట్టినరోజు నాడు అప్డేట్ వస్తే సినిమాకి మంచి హైప్ వస్తది అనుకున్న డైరెక్టర్స్ కి ఇది భారీ షాక్ అయినట్లయింది. కొంతమంది ఘాటుగా ఆ డైరెక్టర్ లని ట్రోల్ చేస్తున్నారు. మరి కొంతమంది అల్లు అర్జున్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో అర్థం కావడం లేదు అంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news