Movies"అందుకే క్లీన్ కారా జాతకం బయటపెట్టాలి వచ్చింది" .. ఇన్నాళ్లకు అసలు...

“అందుకే క్లీన్ కారా జాతకం బయటపెట్టాలి వచ్చింది” .. ఇన్నాళ్లకు అసలు విషయం చెప్పేసిన వేణు స్వామి..!

వేణు స్వామి ..సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ దక్కించుకున్న పేరు. ఎంతలా అంటే ఒక స్టార్ హీరోకి ఒక పాన్ ఇండియా హీరోకి ఎంత పాపులారిటీ ఉంటుందో .. అంతకు డబల్ కాదు ట్రిపుల్ స్థాయిలో సంపాదించుకున్న స్టార్ సెలబ్రిటీ . అటు పొలిటీషియన్స్ ఇటు సెలబ్రిటీ జీవితాలలో జరిగే విషయాలను ముందుగా చెప్పేస్తూ వచ్చే వేణు స్వామి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఆ ఇంటర్వ్యూలో పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ పై వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ గా మారాయి . అదే విధంగా మెగా మనవరాలు క్లీం కార జాతకం పై ఒకప్పుడు వేణు స్వామి చేసిన కామెంట్స్ ను యాంకర్ ప్రశ్నించగా దానికి మళ్లీ వేణు స్వామి ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . క్లింకార జాతకాన్ని వేణు స్వామి చెప్పినప్పుడు చాలామంది ట్రోల్ చేశారు. పుట్టి పుట్టగానే జాతకం ఎలా చెప్తావ్ అలా చెప్పకూడదు అన్న సెన్స్ నీకు లేదా ..? అంటూ ఓ రేంజ్ లో ఏకేశారు .

ఇదే విషయంపై వేణు స్వామిని యాంకర్ ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానం ఇస్తూ .. “కేవలం బాలారిష్టం ఉన్న పిల్లలకు మాత్రమే జాతకాలు చెప్పకూడదు . అది మాకు తెలుసు.. ఒకవేళ అలా చెప్తే వారికి ఉండే గడాలు గురించి కూడా చెప్పాలి ..అది మరింత ప్రమాదకరం .. అందుకే అలా పిల్లల జాతకాలను బయటపెట్టరు. కానీ అన్ని బాగున్న పిల్లలకు జాతకాలు చెప్పవచ్చు . మెగా మనవరాలు జాతకంలో ఒక్కటంటే ఒక్క దోషం కూడా లేదు . మహాజాతకురాలు తాతనే మించి పోయే జాతకం క్లింకారాది. అందుకే ఆమె గురించి బయట పెట్టాల్సి వచ్చింది . ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది . ఊరికే ఏదోకటి ట్రోల్ చేయాలి అని ట్రోల్ చేస్తే అది మంచిది కాదు ” అంటూ చెప్పుకొచ్చాడు . ప్రస్తుతం వేణు స్వామి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news