Movies"అత్తారింటికి దారేది'లో చెప్పిన ఆ డైలాగ్ నే నిజం చేసిన సమంత.....

“అత్తారింటికి దారేది’లో చెప్పిన ఆ డైలాగ్ నే నిజం చేసిన సమంత.. అన్నట్లే చేసిందిగా..!

సమంత .. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ .. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి . అఫ్ కోర్స్ ఒకప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన సమంత ఇప్పుడు ట్రోలింగ్ కి గురవుతుంది. దానికి కారణం ఏంటి అనేది కూడా మనకు తెలిసిందే. అయితే కేవలం సమంత మాత్రమే అలా చేసిందా..? అంటే నో అని చెప్పాలి. లైఫ్ లో చాలామంది హీరోయిన్స్ అలానే చేశారు . కానీ జనాలు మాత్రమే ఎందుకో సమంతనే టార్గెట్ చేసి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు .

తాజాగా హీరోయిన్ సమంతకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. మరీ ముఖ్యంగా సమంత ఫ్యాన్స్ ఈ వార్తను బాగా ట్రెండ్ చేస్తూ ఉండడం గమనార్హం. సమంత కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా అత్తారింటికి దారేది . ఈ సినిమాలో ఆమె పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా.. ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసింది . అయితే ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది .

పవన్ కళ్యాణ్ వాచ్ అమ్మితే మీ బ్యాచ్ సెటిల్ అయిపోద్ది అంటూ ఒకానొక సందర్భంలో ఒక డైలాగ్ చెబుతుంది . ఇప్పుడు సమంత నిజంగా అలాంటి వాచ్ ధరించింది . రీసెంట్గా సమంత చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . ఆమె మెలికలు తిరిగిపోతూ హాట్ ఫిజిక్ తో అందరిని అదరగొట్టేసింది . ఈ పిక్ లో సమంత ధరించిన వాచ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది . అది వజ్రాలు పొదిగిన వాచ్ .. సమంత ధరించిన వాచ్ బల్గేరి స్పాటనీ అనే ఇటాలియన్ బ్రాండ్ కి సంబంధించినది. ఆ వాచ్ ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. ఆ వాచ్ ధర అక్షరాల 70 లక్షలు . దీంతో సోషల్ మీడియాలో సమంత ఫ్యాన్స్ ఇదే న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు . అత్తారింటికి దారేదిలో చెప్పిన డైలాగ్ ని నిజం చేసి చూపించిందిగా అంటూ ఫన్నీగా ట్రెండ్ చేస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news