Moviesరాజమౌళితో సినిమా కోసం ఇష్టమైన దానిని దూరం పెట్టుకుంటున్న మహేష్ బాబు...

రాజమౌళితో సినిమా కోసం ఇష్టమైన దానిని దూరం పెట్టుకుంటున్న మహేష్ బాబు .. ఎంత కష్టమొచ్చింది బాసు నీకు..!

రాజమౌళితో వర్క్ చేయాలి అని ప్రతి ఒక్క స్టార్ సెలబ్రిటీకి ఉంటుంది. అయితే అందుకోసం కొన్ని కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా ఎవరైతే ఫ్యామిలీకి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ చిలౌట్ అవుతూ సరదా సరదాగా గడుపుతూ ఉంటారో అలాంటి వాళ్ళు రాజమౌళితో సినిమా అంటే మాత్రం ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే .

అయితే ఏం చూసి రాజమౌళి సినిమాకి ఒప్పుకున్నాడో తెలియదు కానీ మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళితో సినిమా కోసం తన ఎంతో ఇష్టమైన దాన్ని కూడా దూరం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. రాజమౌళితో మహేష్ బాబు భారీ అడ్వెంచర్స్ మూవీకి ఫిక్స్ అయిన విషయం అందరికీ తెలిసిందే .

నిజానికి ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి రావాల్సి ఉంది . కానీ కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమా ఆలస్యం అయింది. రీసెంట్గా ఈ సినిమా కోసం మహేష్ బాబు చేస్తున్న త్యాగానికి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . మహేష్ బాబు ఫ్యామిలీతో సరదా సరదాగా గడపడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. సంవత్సరానికి కచ్చితంగా నాలుగు సార్లు వెకేషన్స్ కి వెళ్తూ ఉంటారు.

అలాంటి మహేష్ బాబు ఇకపై ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మహేష్ బాబును తన సినిమా కోసం మలుచుకోవడానికి పూర్తిస్థాయిలో ఫిట్నెస్ కి అంకితం చేయబోతున్నడట రాజమౌళి . దానికోసం ప్రత్యేక షెడ్యూల్ ని కూడా ఇచ్చేసాడట. ఆ షెడ్యూల్ లిస్ట్ చూస్తే దిమ్మ తిరిగిపోతది . ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా దాదాపు 6 నెలల పాటు నిర్విరామంగా షెడ్యూల్ ఫిక్స్ చేశారట. దీంతో ఫ్యామిలీతో సరదాగా గడిపే టైమే లేకుండా పోతుంది మహేష్ బాబుకి .. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news