Moviesఅభిమానులను సక్సెస్ ఫుల్ గా బకరాలు చేసిన కీర్తి సురేష్ .....

అభిమానులను సక్సెస్ ఫుల్ గా బకరాలు చేసిన కీర్తి సురేష్ .. ఒక్క పోస్టుతో వెధవలను చేసేసిందిగా ..!!

హ..హ..హ హీరోయిన్స్ అంటే నాటిగా ఉండాలి అంటూ ఉంటారు బహుశా కీర్తి సురేష్ ఆ మాటలను బాగా బుర్రకు ఎక్కించేసుకున్నట్లు ఉంది. అందుకే వాళ్ళని వీళ్ళని కాదు ఏకంగా తన అభిమానులనే బకరా చేసేసింది. అది ఎలా అంటారా ఇది చదవండి మీకే అర్థమవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకుంది కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ..ప్రెసెంట్ టాలీవుడ్ -కోలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ముందుకెళ్తుంది.

ఆఫ్ కోర్స్ తెలుగులో చేసిన భోళాశంకర్ సినిమా ఫ్లాప్ అయింది . కానీ అమ్మడుకు మాత్రం అవకాశాలు వస్తున్నాయి . దానికి కారణం మహానటి సినిమా అని చెప్పక తప్పదు . రీసెంట్ గా సోషల్ మీడియాలో కీర్తి సురేష్ ఒక పోస్ట్ షేర్ చేసింది .ఈ పోస్ట్ చూసిన జనాలు ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఫిక్స్ అయిపోయారు . ఇండస్ట్రీలో నెక్స్ట్ పెళ్లి చేసుకునే హీరోయిన్ కీర్తి సురేష్ అంటూ కూడా వార్తలు వైరల్ అయ్యాయి.

సీన్ కట్ చేస్తే అదంతా వేరే పెళ్లి కోసం పెట్టిన పోస్ట్ అంటూ క్లారిటీ వచ్చేసింది . రీసెంట్గా పెళ్లికి రెడీ అయిన కీర్తి సురేష్ సెల్ఫీ తీసుకొని ఆ ఫోటోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది . పెళ్లికి రెడీ అయ్యాక సెల్ఫీ కంపల్సరీ అనే విధంగా ఓ పోస్ట్ షేర్ చేసింది . ఇది చూసిన జనాలు కీర్తి సురేష్ పెళ్లికి రెడీ అని పరోక్షకంగా హింట్ ఇచ్చేసింది అంటూ చెప్పుకొచ్చారు . పలువురు కంగ్రాట్యులేషన్స్ అంటూ కూడా విష్ చేశారు . అదంతా అమ్మడు తన ఫ్రెండ్ పెళ్లి కోసం పెట్టిన పోస్ట్ అంటూ క్లారిటీకి వచ్చేసింది . దీంతో అభిమానులు ఫుల్ డిసప్పాయింట్ అయిపోయారు. అరెరె.. కీర్తి సురేష్ మనల్ని బకరా చేసేసిందే అంటూ పెదవి కొరుక్కుంటున్నారు . ప్రజెంట్ కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలో మూడు సినిమాలతో బిజీగా ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news