Moviesకల్కి VS పుష్ప 2 VS దేవర VS గేమ్ చేంజర్.....

కల్కి VS పుష్ప 2 VS దేవర VS గేమ్ చేంజర్.. నెక్స్ట్ చరిత్ర తిరగరాయబోయే సినిమా ఏది..?

సినీ లవర్ కు ఇది ఓ పెద్ద పండగనే చెప్పాలి . జనరల్ గా మనకు పెద్ద పండుగ అంటే సంక్రాంతి. సంవత్సరానికి ఒకసారి వస్తుంది కానీ ఈసారి మాత్రం టూ టూ స్పెషల్ ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు బడా హీరోలు నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కాబోతున్నాయి . ఇంతకంటే అభిమానులకి ఆనందకర విషయం మరొకటి ఉంటుందా ..? అయితే ఇక్కడే సోషల్ మీడియాలో కొట్టుకొని చచ్చే జనాలు కూడా ఉన్నారు. మా హీరో గొప్ప అంటే మా హీరో తోపు అంటూ బుర్రపిక్కునే వాళ్ళు కూడా ఉన్నారు.

ప్రభాస్: మే 30వ తేదీ కల్కి సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా కోసం పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అందులో అసలు డౌటే లేదు . కోట్లు కాదు రికార్డ్స్ బద్దలు కొట్టే రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ .

బన్నీ: పుష్ప ఆగస్టు 15వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది పుష్ప 2 . రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ అభిమానులకు గూస్ అబంప్స్ తెప్పిస్తుంది. చీర కట్టులో అల్లు అర్జున్ ఫైట్ సీన్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా..? అంటూ జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .

తారక్: దేవర దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది . ఎన్టీఆర్ ఎంతో ఈ సినిమాని ఇష్టంగా ఓకే చేశారు. ఈ సినిమా కోసం ఏడు కేజీల బరువు కూడా తగ్గారు. రీసెంట్ గానే ఓ ఈవెంట్లో మాట్లాడిన ఎన్టీఆర్ దేవర పై ఎలాంటి అప్డేట్ ఇచ్చారో మనందరికీ తెలిసిందే . ఇలాంటి ఒక అప్డేట్ విన్నాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఈ సినిమా గురించి ఊహించుకుంటారు . మనకు తెలిసిందే ఈ సినిమా చరిత్ర తిరగ రాయడం పక్క అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ .

చరణ్: గేమ్ చేంజర్ ఈ సినిమాపై మెగా అభిమానులు తప్పిస్తే మిగతా వాళ్ళు అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. దానికి కారణం డైరెక్టర్ శంకర్ దర్శకత్వం . అంతేకాదు ఈ సినిమా విషయంలో శంకర్ నిర్లక్ష్యం వహించారు అంటూ మెగా ఫాన్స్ కూడా మండిపడ్డారు . అయితే సినిమా కాన్సెప్ట్ మాత్రం చాలా వెరైటీగా ఉంటుందని ఇప్పటివరకు మనం చరణ్ ని ఎప్పుడు చూడని లుక్స్ లో చూడబోతున్నాం అంటూ లీకైన పిక్స్ ఆధారంగా తెలుస్తుంది . కోట్లు కలెక్ట్ చేసే రికార్డులు బ్రేక్ చేస్తుంది అని చెప్పలేకపోయినా ఖచ్చితంగా ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటుంది అని మాత్రం చెప్పగలం.

ఈ నాలుగు సినిమాల విషయాలలో ఇప్పుడు ఫాన్స్ ఎక్కువగా స్పందిస్తున్నారు. మా హీరో సినిమా హిట్ అవుతుంది అంటే మా హీరో సినిమా రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అంటూ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు . మరి మీరేమనుకుంటున్నారు ఈ సినిమాలలో ఏ సినిమా చరిత్ర తిరగరాయబోతుంది..? అని మీ ఒపీనియన్ ..కామెంట్స్ రూపంలో మీ ఆన్సర్ తెలియజేయండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news