Moviesసినిమాలకు టోటల్ గా గుడ్ బై చెప్పబోతున్న 100 కోట్ల...

సినిమాలకు టోటల్ గా గుడ్ బై చెప్పబోతున్న 100 కోట్ల హీరో.. ఆ వివాదమే కొంప ముంచేసిందా ..?

ఎస్ ప్రెసెంట్ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ సినిమా వర్గాలలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ జనరల్ గా నటనకు దూరంగా ఉండడం చాలా చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది . కొన్ని అనివార్య కారణాలు కారణంగా తప్పిస్తే అలాంటి సిచువేషన్ ఏ హీరో కూడా దగ్గరికి తీసుకురారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అమీర్ ఖాన్.. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడట .

రీజన్ ఏంటి అనేది స్పష్టంగా తెలియనప్పటికీ ఆయన తన వద్దకు వచ్చిన డైరెక్టర్ కి ఇక సినిమాలు చేయను అంటూ చెప్పుకొస్తున్నాడట . అంతేకాదు చెన్నై లో అమీర్ ఖాన్ సెటిల్ అవ్వబోతున్నాడట . తన తల్లికి హెల్త్ బాగో లేని కారణంగా ట్రీట్మెంట్ కోసం కొన్ని నెలలుగా చెన్నైలో ఉంటూ తన తల్లికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు అమీర్ ఖాన్ . ఇన్ని నెలలుగా ఆయన హీరో విశాల్ ఇంట్లోనే బస చేస్తూ వచ్చారు .

ఫైనల్లీ అమీర్ ఖాన్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి టోటల్గా చెన్నైలో సెటిల్ అవ్వాలి అంటూ డిసైడ్ అయ్యారట . ఇప్పటికే ఒక లగ్జరీ హౌస్ ని కూడా కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన ఆఖరిగా నటించిన సినిమా లాల్ సింగ్ చద్దా. ఆ ట్రోలింగ్ భరించలేని కారణంగానే ఆ తర్వాత ఏ సినిమాకి కమిట్ అవ్వలేదు అంటూ కూడా ప్రచారం జరిగింది. ప్రజెంట్ అమీర్ ఖాన్ సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నాడు అన్న వార్త ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మల్టీ టాలెంటెడ్ హీరో అమీర్ ఖాన్ సినిమాలకి గుడ్ బై చెప్పబోతున్నాడు అని తెలుసుకుని అభిమానులు షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news