Moviesకృష్ణంరాజుకి ఇష్టం లేకపోయినా ప్రభాస్ రొమాన్స్ చేసిన ఏకైక హీరోయిన్ ఈమె...

కృష్ణంరాజుకి ఇష్టం లేకపోయినా ప్రభాస్ రొమాన్స్ చేసిన ఏకైక హీరోయిన్ ఈమె .. డార్లింగ్ కు ఎంత స్పెషల్ అంటే..!

ప్రభాస్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా రాజ్యమేలేస్తున్నాడు . పాన్ ఇండియా లెవెల్లో చక్రం తిప్పేస్తున్నాడు. రీసెంట్గా సలార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . త్వరలోనే కల్కి సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు . కాగా ప్రెసెంట్ ఆయన నటిస్తున్న పలు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ కి సంబంధించిన పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి .

ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజుకి ఇష్టం లేకపోయినా ఒక హీరోయిన్ తో రొమాన్స్ చేశాడు అన్న వార్త నెట్టింట వైరల్ అవుతుంది . ఆ హీరోయిన్ మరెవరో కాదు త్రిష. ప్రభాస్ కెరియర్ ని మలుపు తిప్పిన చిత్రాలలో శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన వర్షం కూడా ఒకటి . ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ సినిమాలో హీరోయిన్ త్రిష తో జతకట్టాడు ప్రభాస్ .స్టార్ హీరోగా మారిపోయాడు .

వీళ్ళిద్దరి కాంబో బ్లాక్ బస్టర్ హిట్ అయింది . ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ త్రిష రొమాన్స్ అందరినీ ఆకట్టుకునింది . అయితే ప్రభాస్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ అంటే కాస్త ఇబ్బంది పడేవారు .కానీ భయం లేకుండా త్రిష తో నటించేసాడు . ఓ రోజు సినిమాలోని రొమాంటిక్ సీన్ చేస్తున్నప్పుడు కృష్ణంరాజు అక్కడికి వెళ్లారట . అప్పుడు ఆయన నో చెప్పారట . కానీ ఆల్రెడీ నిర్మాతకు మాట ఇచ్చేసాం అన్న కారణంగా ప్రభాస్ కృష్ణంరాజుకి ఇష్టం లేకపోయినా అలాంటి సీన్స్ లో నటించాడు. ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . ఆ తర్వాత వీళ్ళకాంబోలో చాలా సినిమాలు వచ్చాయి.. అన్నీ కూడా హిట్ అయ్యాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news