Moviesరవితేజ ఫ్యాన్స్ ఎగిరి గంతేసే న్యూస్.. మంచంలోని ముసలోళ్లకు సైతం ఊపు...

రవితేజ ఫ్యాన్స్ ఎగిరి గంతేసే న్యూస్.. మంచంలోని ముసలోళ్లకు సైతం ఊపు తెప్పించే ఆ సినిమాకు సీక్వెల్ వచ్చేస్తుందోచ్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ హీరో అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు రవితేజ . ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో ప్రజెంట్ హిట్లు లేక అల్లాడిపోతున్నాడు . అయినా సరే ఫ్యాన్స్ క్రేజ్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.

సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరీ ముఖ్యంగా రవితేజ ఫ్రెండ్ షిప్ కి ఎంత వాల్యూ ఇస్తారో..? ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతాడు అన్న విషయం అందరికీ తెలిసిందే . కాగా ఈ మధ్యకాలంలో ఒక సరి కొత్త ట్రెండ్ బాగా వైరల్ గా మారింది. గతంలో హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ రావడం మళ్ళీ అదే సినిమాలను రీ రిలీజ్ చేస్తూ ఉండడం సోషల్ మీడియాలో మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం.

రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సైతం ఇదే విషయాన్ని ఫాలో అవుతున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. పూరి జగన్నాథ్ కెరియర్ లోనే ఎంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా “ఇడియట్”. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఇప్పటికీ పూరి జగన్నాథ్ పేరు వింటే అందరికీ మొదట గుర్తు వచ్చేది ఈ సినిమానే..

కాగా ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుందట . అందులో కూడా హీరోగా రవితేజ నే నటించబోతున్నాడట . తెరపై రవితేజ పూరి జగనాథ్ కాంబో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో చూపులతో గుచ్చి గుచ్చి సాంగ్ మరీ ముఖ్యంగా మంచంలోని ముసలోళ్లకు సైతం ఊపు తెప్పించేస్తుంది . మరి అలాంటి సినిమాకి సీక్వెల్ రాబోతుంది అంటే ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేయకుండా ఉంటారా..? ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది ..? ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ వెయిట్ చేస్తున్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news