Moviesకృష్ణ - మహేష్ బాబుకు ఉన్న ఆ అలవాటు.. గౌతమ్ బాబుకు...

కృష్ణ – మహేష్ బాబుకు ఉన్న ఆ అలవాటు.. గౌతమ్ బాబుకు రాలేదే.. ఎందుకబ్బా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణకు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయన ఇప్పుడు మన మధ్య లేడు .. కానీ ఆయన పేరు చెప్తే ఊగిపోయే జనాలు ఎంతోమంది మన ఇంట్లోనే ఉంటారు. నాన్నలు తాతలు ఆయన పేరు చెప్పగానే ఓ రేంజ్ లో చరిత్రను చదువుతూ ఉంటారు . అలాంటి ఓ ప్రత్యేకమైన ఘనతను అందుకున్నాడు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు సైతం నేటి జనరేషన్ ను రేంజ్ లో ఊపేస్తున్నాడు .

మంచి మంచి సినిమాలు తో ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోగా కొనసాగుతున్నాడు . రీసెంట్గా మహేష్ బాబు కృష్ణలకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే.. కృష్ణ – మహేష్ బాబు చాలా చాలా జోవియల్.. మరి ముఖ్యంగా ఎలాంటి టాపిక్స్ అయినా సరే ఫన్నీగా తీసుకెళ్లడంలో వీళ్ళ తర్వాత ఎవరైనా.. పలు మీడియా సమావేశంలో కూడా మనం అలాంటి సందర్భాలు చూసాం . అయితే కృష్ణ – మహేష్ బాబు ఎంత టాకిటివో.. గౌతం మాత్రం చాలా సైలెంట్ .

జనాలతో ఎక్కువ మాట్లాడరు . అంతేకాదు చాలా సైలెంట్ గా ఉంటాడు . పెద్ద యాక్టివ్ గా కూడా ఉండడు . తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా జోష్ గా కనిపించడు . ఈ క్రమంలోనే మహేష్ బాబు – కృష్ణ ఎంత నాటి ఫెలోస్ గా ఉన్నారో.. గౌతం మాత్రం అంత సైలెంట్ అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . నిజానికి మహేష్ బాబు – నమ్రత ఇద్దరు కూడా చాలా యాక్టివ్ పర్సన్స్ . మరి గౌతమ్ కి ఎవరి పోలికలు వచ్చాయో ..? అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. అంతేకాదు కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి గారు కూడా చాలా సైలెంట్ . బహుశా ఆమె పోలికలు వచ్చి ఉండొచ్చు అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news