Movies'భీమా' మూవీ రివ్యూ : గోపీచంద్ ఊర మాస్ కం బ్యాక్..నిజంగా...

‘భీమా’ మూవీ రివ్యూ : గోపీచంద్ ఊర మాస్ కం బ్యాక్..నిజంగా బ్రహ్మ రాక్షసుడే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యాంచో హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న గోపీచంద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా భీమా. కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయి అభిమానులను బాగా ఆకట్టుకునింది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో గోపీచంద్ పర్ఫామెన్స్ కెవ్వు కేక అనే చెప్పాలి . బాక్సాఫీస్ దగ్గర చాలాకాలం తర్వాత హిట్ అందుకున్నాడు గోపీచంద్ .

ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన టాక్ వైరల్ అవుతుంది. ఒకప్పుడు గోపీచంద్ సినిమా అంటే బీసీ సెంటర్లలో పండగ వాతావరణం నెలకొనేది. కానీ కొన్ని సంవత్సరాల నుంచి అది మిస్ అయింది .మళ్ళీ భీమా సినిమాతో తన పునర్ వైభవాన్ని అందుకున్నాడు గోపీచంద్. మహేంద్రగిరిలో అరాచక శక్తులతో అల్లకల్లోలంగా ఉంటుంది . అక్కడ తిరుగులేని శక్తి భవాని (ముఖేష్ తివారి) ట్యాంకర్స్ కు ఎవరు అడ్డుపడినా సరే భవాని అస్సలు ఊరుకోడు .

ఎంతటికైనా తెగించేస్తాడు ..అలా చెక్ పోస్ట్ దగ్గర తన ట్యాంకర్స్ ను ఆపిన ఒక ఎస్సై కమల్ కామరాజును చంపేస్తాడు ..అప్పుడు ఆ ప్లేస్లో భీమా ఆ ఊరికి వెళ్తాడు . అయితే అందరిలాంటి వాడు కాదు భీమా అని తెలుసుకుంటాడు భవాని . ఆ తర్వాత వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు మొదలయ్యాయి ..అసలు భవాని ఆ ట్యాంకర్లలో ఏమి సీక్రెట్ గా దాచాడు అన్న విషయం సినిమాకి హైలైట్ గా మారుతుంది .

ప్రీ క్లైమాక్స్ లో రివిల్ అయ్యే ట్విస్ట్ అయితే కథను మలుపు తిప్పబోతుంది . అంతేకాదు ఈ సినిమాకి బ్యూటీ టచ్ కూడా ఇచ్చారు డైరెక్టర్. మాళవిక శర్మ అందాలు ఈ సినిమాకి మరింత హైలెట్ గా నిలిచాయి. అంతేకాదు గోపీచంద్ పోలీస్ గెటప్పుల్లో ఇరగదీసేసాడు . చాలా కాలం తర్వాత గోపీచంద్ హిట్ అందుకోవడంతో ఫ్యాన్స్ ఈ సినిమా రివ్యూ ను బాగా ప్రమోట్ చేస్తున్నారు . ఇక గోపీచంద్ టైం స్టార్ట్ అయిందని.. ఇక అన్ని మంచి హిట్ సినిమాలు ఆయన ఖాతాలో పడతాయి అని కామెంట్స్ చేస్తున్నారు . చూద్దాం మరి భీమా సినిమా ఫస్ట్ డే ఎటువంటి కలెక్షన్స్ సాధిస్తుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news