Moviesబిగ్ షాకింగ్: యాంకర్ సుమ ఫ్యాన్స్ కి వెరీ వెరీ బ్యాడ్...

బిగ్ షాకింగ్: యాంకర్ సుమ ఫ్యాన్స్ కి వెరీ వెరీ బ్యాడ్ న్యూస్ ..ఇన్నాళ్లు సంపాదించుకున్న పరువు సంకనాకీ పాయే..!

యాంకర్ సుమ.. అభిమానులకు ఇది జీర్ణించుకోలేని విషయం అనే చెప్పాలి. కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానం దక్కించుకుంటూ వచ్చిన యాంకర్ సుమ ఇప్పుడు ఏకంగా నాలుగో స్థానంలో నిలిచింది . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ గా మారింది . అంతేకాదు అభిమానుల గుండెలు బద్దలయ్యేలా చేస్తుంది. మనకు తెలిసిందే ఇండస్ట్రీలో ఎంతమంది యాంకర్స్ ఉన్నా సరే యాంకర్ సుమ పేరు చెప్పగానే అందరూ ఓ రేంజ్ లో అరుపులు.. కేకలు వేస్తారు .

హెల్తీగా కామెడీ పంచెస్ చేయడంలో సుమ తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. తాజా సర్వేలో సుమ ర్యాంకింగ్ పడిపోయింది . దారుణాతి దారుణంగా నాలుగవ స్థానంలో నిలిచింది . ప్రముఖ సంస్ధ ఆర్నాక్స్ మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీస్ తెలుగు పై సర్వే చేసింది . ఈ సర్వేలో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి . ఈ లిస్టులో యాంకర్ ప్రదీప్ మాదిరాజు మొదటి స్థానంలో నిలిచాడు . మేల్ యాంకర్ గా ప్రదీప్ మాచిరాజు చాలా కాలంగా సత్తా చాటుతూ వస్తున్నాడు.

ప్రదీప్ స్థానం తర్వాత సుడిగాలి సుధీర్ రెండో స్థానం దక్కించుకున్నాడు. ఇక మూడో స్థానంలో హైపర్ ఆది.. నాల్గవ స్థానంలో యాంకర్ సుమ .. ఐదవ స్థానంలో చమ్మక్ చంద్ర నిలిచారు . దీంతో సుమ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . ఇండస్ట్రీలో సుమలాంటి యాంకర్ ఎవ్వరూ లేరు. ఇదేం తొక్కలో సర్వే అంతా ఫేక్ అంటూ మండిపడుతున్నారు . మరి కొంతమంది నిజం నమ్మడానికి చేదుగా ఉంటుంది అంటూ వ్యంగంగా ట్రోల్స్ చేస్తున్నారు . సుమ పరువు పోయింది అంటూ వెటకారంగా కౌంటర్స్ వేస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news