Moviesఓరి దేవుడోయ్.. హిందీ "బేబీ" సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..? పగలు...

ఓరి దేవుడోయ్.. హిందీ “బేబీ” సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..? పగలు చూస్తే పగలే కల్లోకి వచ్చే సెక్సీ ఫిగర్..!!

బేబీ .. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఎన్ని ప్రభంజనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకటి కాదు రెండు కాదు భారీ స్థాయిలో రికార్డ్స్ కొల్లగొట్టింది . యూట్యూబర్ గా పాపులారిటీ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. కూసింత హద్దులు మీరుతో బోల్డ్ గానే నటించింది అని చెప్పాలి . అంతేకాదు విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో హీరోగా నటించాడు.

ఈ సినిమాను తనదైన స్టైల్ లో ప్రమోట్ చేసుకున్నాడు నిర్మాత ఎస్ కె ఎన్. సాయి రాజేష్ చాలా డిఫరెంట్గా నేటి జనరేషన్ కి అర్థమయ్యే విధంగా ఈ సినిమాను డైరెక్టర్ చేశాడు. ఈ సినిమా హిందీ తమిళంలో రీమిక్స్ చేస్తున్నట్లు ఇటీవల ఎస్ కె ఎన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి “కల్ట్ బొమ్మ” అనే టైటిల్ని పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని హిందీలో స్టార్ కిడ్స్ తో తెరకెక్కించాలి అని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ . నిజం చెప్పాలంటే అర్జున్ రెడ్డి సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీని మళ్లీ నిలబెట్టేలా చేసింది .

అప్పటివరకు చెత్త సినిమాలే వస్తు మార్కెట్ బాగా పడిపోతూ ఉండగా అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసి సెన్సేషనల్ రికార్డ్స్ ను అందుకున్నారు . ఇప్పుడు అదే కోవాలోకి రాబోతుంది బేబీ అంటూ ప్రచారం జరుగుతుంది.
ఈ సినిమాలో హీరోయిన్గా స్టార్ డాటర్ ఖుషి కపూర్ ని అనుకుంటున్నారట మేకర్స్ . ఈ రేంజ్ లో బోల్డ్ పర్ఫామెన్స్ ఇవ్వాలి అంటే ఖుషి కపూర్ కచ్చితంగా ఉండాల్సిందే అంటూ మేకర్స్ పట్టుబడుతున్నారట. జాన్వికాపూర్ చెల్లెలు కావడంతో ఇంకా హైప్ వస్తుంది అని ఆశ పడుతున్నారట .

అంతేకాదు ఒక స్టార్ హీరో కొడుకుని ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. ఇలా స్టార్ కిడ్స్ తో సినిమా చేయడం వల్ల ఓవర్ నైట్ లో పబ్లిసిటీ వస్తుంది అంటూ అభిప్రాయపడుతున్నారట . త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది అంటున్నారు జనాలు . అంతేకాదు ఈ సినిమాలో ఒక తెలుగు హీరో కూడా ఇంపార్టెంట్ పాత్ర పోషించబోతున్నాడు అని .. అది పూర్తిగా సస్పెన్స్ అంటున్నారు . చూద్దాం ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news