Movies"ఆ కారణంగా మా పెళ్లిని రెండు సార్లు వాయిదా వేశాం"..సంచలన విషయాని...

“ఆ కారణంగా మా పెళ్లిని రెండు సార్లు వాయిదా వేశాం”..సంచలన విషయాని బయటపెట్టిన వరుణ్ తేజ్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీళ్లది ప్రేమ పెళ్లి . దాదాపు ఆరేళ్లపాటు రహస్యంగా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన ఈ జంట ఫైనల్లీ జూన్లో నిశ్చితార్థం .. నవంబర్ ఒకటవ తేదీన పెళ్లి ఘనంగా జరుపుకుంది . కుటుంబ సభ్యుల మధ్య ఏడడుగులు వేశారు .

రీసెంట్గా ఆయన నటించిన “ఆపరేషన్ వాలెంటైన్” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు వరుణ్ తేజ్. ” సినిమాల విషయంలో నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటానని ..ఒక సినిమా చేస్తున్నప్పుడు .. ఆ మూవీలోని పాత్రని తనలో లీనం చేసుకొని యజ్ఞంలో షూటింగ్ కి ముందుకు వెళుతూ ఉంటానని ..ఆ సినిమా పూర్తయ్యే వరకు ఎక్కడ కూడా మైండ్ ని డైవర్ట్ చేయకుండా పర్సనల్ విషయంపై ఫోకస్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఉంటానని ..ఆపరేషన్ వాలెంటైన్ సినిమా కోసం నా పెళ్లిని రెండుసార్లు వాయిదా వేసుకున్నాను అని” చెప్పుకు వచ్చాడు .

ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2019లో జరిగిన పుల్వామా టెర్రరిస్ట్ అటాక్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. శక్తి ప్రతాప్ సింగ్ తనదైన స్టైల్ లో ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు . తెలుగు హిందీ భాషల్లో బై లింగువల్ గా ఈ సినిమా రాబోతుంది. మార్చి 1న గ్రాండ్గా థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news