Moviesఅరెరె..ఆ విషయంలో మహేష్-నమ్రత.. సుమ-రాజీవ్ కపుల్స్ ఒకటే.. ఈ విచిత్రం మీరు...

అరెరె..ఆ విషయంలో మహేష్-నమ్రత.. సుమ-రాజీవ్ కపుల్స్ ఒకటే.. ఈ విచిత్రం మీరు గమనించారా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్న సరే ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ రొమాంటిక్ కపుల్ ఎవరు అంటే మాత్రం అందరూ కళ్ళు మూసుకుని టక్కున చెప్పే పేరు నమ్రత – మహేష్ బాబు . వాళ్ళ పెళ్లి జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది . ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా సరే వీళ్ళు చాలా రొమాంటిక్గా ప్లాన్స్ వేస్తూ భార్యాభర్తలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు . భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటారు .

పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన నమ్రత కేవలం కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ తన లైఫ్ ని ముందుకు తీసుకెళ్తుంది. మహేష్ బాబు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేయడానికి ట్రై చేస్తున్నాడు. రీసెంట్గా ఫ్ర్బ్రవరి 10న తమ పెళ్లి రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన నమ్రత – మహేష్ బాబు పెళ్లిరోజు. 2005 ఫిబ్రవరి 10వ తేదీన వీళ్లు పెళ్లి చేసుకున్నారు .

వీళ్ళ పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది . ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వైరల్ అవుతుంది. అదే ఫిబ్రవరి 10వ తేదీన టాలీవుడ్ ఇండస్ట్రిలో స్టార్ యాంకర్ గా పాపులారిటి సంపాదించుకున్న సుమ నటుడు రాజీవ్ కనకాల పెళ్లి కూడా జరిగింది. 1999లో ఫిబ్రవరి 10వ తేదీన రాజీవ్ కనకాల – సుమ పెళ్లి జరిగింది . వీళ్ల పెళ్లి అయీ పాతిక సంవత్సరాలు పూర్తి కావడంతో సుమ సోషల్ మీడియా వేదికగా భర్తతో కలిసి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేసింది. ప్రజెంట్ ఆ ఫొటోస్ ట్రెండ్ అవుతున్నాయి . వీళ్లిద్దరి పెళ్లి ఒకే డేట్ న జరగడం అభిమానులకి ఆశ్చర్యకరంగా ఉంది . ఫిబ్రవరి 10న పెళ్లి చేసుకుంటే భార్యాభర్తలు ఇంత అన్యోన్యంగా ఉంటారా అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news