Moviesఆ నిర్ణయంతో మెగా అభిమానులను భయపెట్టేస్తున్న లావణ్య త్రిపాఠి.. చచ్చారు పో..!

ఆ నిర్ణయంతో మెగా అభిమానులను భయపెట్టేస్తున్న లావణ్య త్రిపాఠి.. చచ్చారు పో..!

పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి బోల్డ్ స్టెప్ వేసిందా..? అంటే అవునని అంటుంది సినిమా ఇండస్ట్రీ . మెగా ప్రిన్స్ గా వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత మిస్ పర్ఫెక్ట్ అంటూ ఫస్ట్ వెబ్ సిరీస్ ని సైన్ చేసింది. అంతేకాదు ఈ సిరీస్ తో మంచి విజయం కూడా అందుకుంది . ఈ సిరీస్ విజయం సాధించడంతో పలువురు తెలుగు బడా డైరెక్టర్ లు ఆమెకు అవకాశం ఇవ్వడం మొదలుపెట్టారు . అంతేకాదు నిన్న మొన్నటి వరకు అవకాశాలు రాక అల్లాడుతున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఫుల్ అవకాశాలు వచేయడంతో అన్ని సినిమాలను ఓకే చేసేస్తుందట.

ఈ క్రమంలోని టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఓ సినిమాలో ఆఫర్ వచ్చిందట. నిజానికి రౌడీ హీరో సినిమాలు ఎలా ఉంటాయో తెలిసిందే. కచ్చితంగా రొమాంటిక్ సీన్స్ ..నాటి డైలాగ్స్ ఉంటాయి . మరి పెళ్లయిన తర్వాత లావణ్య త్రిపాఠి అలాంటి హీరోతో సినిమా చేయాలి అంటే కచ్చితంగా హద్దులు మీరాలి ..? అయితే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ తో పెళ్లి తర్వాత అలాంటి వాటికి దూరంగా ఉంది .

కానీ విజయ్ దేవరకొండతో సినిమాను యాక్సెప్ట్ చేసినట్లు ఫిలిం వర్గాలలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో మెగా అభిమానులకు అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొంది . సినిమాలో కంటెంట్ ఏ విధంగా ఉంటుందో అంటూ భయపడిపోతున్నారు. మరికొందరు లావణ్య చాలా మచిది అని.. మెగా కుటుంబం పరువు తీయ్యదని ఆమె కూల్ పాత్రనే ఓకె చేసి ఉంటుందని చెప్పుకొస్తున్నారు. మొత్తంగా లావణ్య మెగా అభిమానులను లావణ్య భయపెట్టిసి టెన్షన్ పెట్టేస్తుంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news