Moviesఒక్క దెబ్బతో..అటు మెగా ఫ్యాన్స్ కి..ఇటు అక్కినేని అభిమానులకు ఊహించని కోలుకోలేని...

ఒక్క దెబ్బతో..అటు మెగా ఫ్యాన్స్ కి..ఇటు అక్కినేని అభిమానులకు ఊహించని కోలుకోలేని షాక్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి..!

లావణ్య త్రిపాఠి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో ముందుకు దూసుకుపోతుంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇప్పుడు మెగా ఇంటి కోడలుగా మారి హ్యూజ్ సెన్సేషన్ గా మారింది . మెగా బ్రదర్ గా పాపులారిటీ సంపాదించుకున్న నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . వీళ్లిద్దరూ కలిసి నటించిన సినిమా మిస్టర్. ఈ సినిమా ద్వారానే వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు .

ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా ఐదేళ్లు ప్రేమాయణం నడిపి ఫైనల్లీ పెళ్లి చేసుకున్నారు . ప్రెసెంట్ వీళ్ల వైవాహిక జీవితం సాఫీగా ముందుకు సాగుతుంది . పెళ్లి తర్వాత ఫస్ట్ వెబ్ సిరీస్ లో నటించిన లావణ్య త్రిపాఠి మిస్ పర్ఫేక్ట్ అంటూ ఓసిడి గల పాత్రలో లావణ్య త్రిపాఠి కనిపించింది . ఈ సిరీస్ లో మేల్ లీడ్ గా అభిజిత్ నటించాడు. నిజానికి ఈ సిరీస్ లో పెద్దగా చెప్పుకోదగ్గ కంటెంట్ ఏమీ లేదు ..ఒక ఓసిడి గల అమ్మాయికి మరొక రూమ్ డర్టీగా పెట్టుకునే అబ్బాయి ఎదురైతే ఎలా ఉంటుంది ..? వాళ్ళ మధ్య వచ్చే ఫన్నీ కాన్వర్జేషన్ ఏంటి..? ఆ ఇద్దరు ప్రేమలో పడితే వచ్చే చిక్కులు ఏంటి ..?అన్నదే కాన్సెప్ట్ .

నిజానికి లావణ్య త్రిపాఠి లాంటి స్టార్ హీరోయిన్ రేంజ్ కి తగ్గ సిరీస్ కాదు ఇది. కానీ ఆమె ఎందుకు ఒప్పుకున్నిందో ఆమెకే తెలియాలి. అంతేకాదు ఈ సిరీస్ ని ప్రొడ్యూస్ చేసింది అక్కినేని మేనకోడలు సుప్రియ యార్లగడ్డ . దీంతో అక్కినేని ఫ్యాన్స్ కూడా షాక్ అయిపోతున్నారు. ఎన్నో సినిమాలను.. సిరీస్ ను నిర్మించే అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి ఇలాంటి సిరీస్ ని ఎలా నిర్మించగలిగిందా..? అంటూ షాక్ అవుతున్నారు. ఒక్క క్క మిస్ పర్ఫెక్ట్ సిరీస్ తో అటు మెగా అభిమానులకి ఇటు అక్కినేని అభిమానులకి ఊహించిన షాక్ ఇచ్చింది లావణ్య అంటూ మాట్లాడుకుంటున్నారు..!
!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news