Movies"దేవర" సినిమాలో ఎన్టీఆర్ అలాంటి జబ్బు మనిషిగా కనిపించబోతున్నాడా..? ఫ్యాన్స్ ఊరుకుంటారా..?

“దేవర” సినిమాలో ఎన్టీఆర్ అలాంటి జబ్బు మనిషిగా కనిపించబోతున్నాడా..? ఫ్యాన్స్ ఊరుకుంటారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో తారక్ ఎలాంటి ప్రత్యేకమైన స్థానాన్ని అందుకున్నాడో మనకు తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకొని జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు . ఒక్కొక్క సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్న తారక్ ప్రసెంట్ చేస్తున్న సినిమా దేవర . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది .

ఈ సినిమాకి సంబంధించిన చిన్న అప్డేట్ రిలీజ్ అయినా సరే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఊగిపోతూ ఉంటారు . రీసెంట్గా దేవర సినిమాకి సంబంధించిన ఒక టాప్ సీక్రెట్ వైరల్ గా మారింది . ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ జబ్బు మనిషిగా కనిపించబోతున్నాడట . రంగస్థలం సినిమాలో చరణ్ చెవిటి వాడి పాత్రలో కనిపిస్తాడు. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు ఒక కన్ను కనిపించని పాత్రలో కనిపిస్తాడు . అయితే ఎన్టీఆర్ ..దేవర సినిమాలో నత్తివాడిగా కనిపించబోతున్నాడట .

ఎలాంటి డైలాగ్స్ అయినా అవలీలగా చెప్పే ఎన్టీఆర్ కి ఇలాంటి జబ్బు క్యారెక్టర్ డిజైన్ చేయడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు . నత్తి పాత్రలో డైలాగ్స్ చెప్తే జనాలు తీసుకుంటారా ..? అన్న సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు. గతంలో లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ అలాంటి పాత్రలోనే కనిపించారు . ఆ సినిమా ఫ్లాప్ అయింది. మరి కొరటాల ఈ సినిమాతో హిట్ అందుకుంటాడా..? లేడా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news